విజయవాడ: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజానికి అవసరమైన సమయాల్లో సేవ చేయడానికి కట్టుబడి ఉంది. గత 48 గంటల్లో భారీ వర్షాలు, కృష్ణా నది వరదల కారణంగా అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటైన తాడేపల్లిలో ఆసుపత్రి తరుపున ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆసుపత్రి సిబ్బంది మరియు వాలంటీర్ల ద్వారా బాధిత కుటుంబాలకు ఆహారం పంపిణీ చేయబడిరది. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజ సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. విపత్తు సమయంలో సేవలను అందించడానికి ప్రయత్నిస్తుంది.