ముంబయి: వినూత్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ముంబైలోని తాజ్ శాంతాక్రజ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివో ఇమాజిన్ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ అవార్డుల రెండవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. ఈ అవార్డులు ఊహా శక్తిని జరుపుకోవడం సృజనాత్మకత సరిహద్దులను దాటడానికి ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించడం, వారి స్మార్ట్‌ఫోన్ లెన్స్ ద్వారా వారి ప్రత్యేక దృక్పథాలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. జ్యూరీ విన్నర్ కూడా అయిన కుక్కాల సురేష్ తన అద్భుతమైన రూ.5 లక్షల గ్రాండ్ ప్రైజ్ అందుకున్నాడు. సాంకేతిక నైపుణ్యం, కళాత్మక దృష్టి పరిపూర్ణ సమ్మేళనానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది. ఇది దేశవ్యాప్తంగా 17,000ం ఎంట్రీలలో ఒకటిగా నిలిచింది. ఆరుగురు కేటగిరీ విజేతలకు ఒక్కొక్కరు వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆర్కిటెక్చర్‌లో బందిష్ రవీంద్ర వడయేకర్, పోర్ట్రెయిట్‌లో లోపముద్ర తాలుక్దార్, స్ట్రీట్ అండ్ కల్చర్‌లో సౌమ్యసిక మన్నా, నేచర్ అండ్ ల్యాండ్‌స్కేప్‌లో రతిన్ డే, మోషన్‌లో ఇద్రీస్ అబ్బాస్ దార్, నైట్ అండ్ లైట్ విభాగాల్లో కుక్కాల సురేష్ విజేతలుగా నిలిచారు. ప్రముఖ రచయిత్రి, చిత్రనిర్మాత జోయా అక్తర్‌తో పాటు వినీత్ వోహ్రా, రాకేశ్ పులపా, అమీర్ వనీ వంటి ప్రముఖ ఛాయాగ్రాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.