ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ సాధారణ బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన 22వ వ్యవస్థాపక దినోత్సవం రోజున ముంబయిలో ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ అవార్డ్ జూనియర్ క్విజ్ 2024కు సంబంధించిన 9వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేను నిర్వహించింది. ఫినాలే ఆరు జట్ల మధ్య విజ్ఞాన యుద్ధానికి సాక్ష్యంగా నిలవగా, ఈ ఏడాది వడోదరలోని న్యూ ఎరా సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు నిర్మయ్ పటేల్ మరియు శౌర్య బెనర్జీ విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది ది3,200 పాఠశాలల విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. వారికి గట్టి పోటీనిస్తూ చెన్నైలోని ఎంసీఎం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ మరియు జైపూర్‌లోని కేంబ్రిడ్జ్ కోర్ట్ హైస్కూల్ వరుసగా ప్రశంసనీయమైన మొదటి మరియు రెండవ రన్నరప్ స్థానాలను పొందాయి.