విశాలాంధ్ర/హైదరాబాద్: సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్, కంపెనీ ఈక్విటీ షేర్ల సబ్-డివిజన్/స్ప్లిట్ ప్రతిపాదనను పరిశీలించేందుకు 30న తమ బోర్డు సమావేశమవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ముఖ విలువ రూ.1 బోర్డు నిర్ణయించే విధంగా ఒక్కొక్కటి 10 రూపాయలుగా ఉందన్నారు. జూలైలో, కంపెనీ ప్రమోటర్లకు కన్వర్టిబుల్ వారెంట్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు కంపెనీ ఆమోదం తెలిపిందన్నారు. సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్, రసాయన మ ఔషధ పరిశ్రమలలో ప్రముఖ పేరుగా ఎదిగిందన్నారు. దాని ప్రమోటర్లు హేమల్, వి.మెహతా, సచిన్ వి.మెహతా నేతృత్వంలో, సమిష్టిగా 25 సంవత్సరాల పరిశ్రమ అనుభవాన్ని కలిగి ఉన్నారన్నారు. స్పెషాలిటీ కెమికల్స్, బల్క్ డ్రగ్స్‌లో బలమైన పునాదిని ఏర్పాటు చేసిందన్నారు.