న్యూదిల్లీ: వివిధ రాష్ట్రాల్లో వరద సహాయ చర్యల నిమిత్తం పీఎం కేర్స్ నిధికి రూ.3 కోట్ల విరాళం ఇస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన కుటుంబాలు, వ్యక్తులకు మేం అండగా నిలవాలని నిర్ణయించాం. ఇలాంటి కష్ట సమయంలో అందరూ ఒక్కటై, పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ హిసాషి టెకూచీ తెలిపారు.