హైదరాబాద్ : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రూపొం దుతున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే కొత్త పోస్టర్ రిలీజైంది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతా కంపై వంశీ-ప్రమోద్-ప్రశీద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మి స్తున్నారు. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా మీద బాగా అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో అక్టోబర్ 13 హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా, ఇందులో ప్రేరణగా నటిస్తున్న ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ పోస్టర్‌లో పూజా వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఒకవైపు తిరిగి స్మైల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది.