బుల్లి తెర స్టార్ అనసూయ పరిచయం లేని యాంకర్. ఆమె ఏ షో మొదలు పెట్టినా అది విజయవంతమౌతుంది. జబర్దస్త్తో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు ఓ రేంజ్లో వెళుతోంది. ఇప్పటి హీరోయిన్లు సైతం ఆమె అంత బిజీగా ఉండటం లేరన్నది నమ్మ శక్యం కాని నిజం. ఆమె బుల్లి తెర గోల్డెన్ లెగ్గా భావిస్తున్నారు. ఆమె యాంకరింగ్ చేసిన ఏ షో అయినా ఇంత వరకు ఫెయిల్యూర్ కాలేదు. ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి అయినా షోలో మాత్రం ఎంతో గ్లామరస్గా కనిపిస్తుంది. బుల్లి తెరల్లోనే ఆమె ఎంతో బిజీ అయిపోయింది. పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఎందుకంటే ఆమెకు పారితోషికం కంటే పాత్రే ప్రధానం అన్నది ఆమె తీరు. అందుకే సినిమాల్లో ఎన్నో ఆఫర్లు వచ్చినా కొన్నింటికే ఆమె మొగ్గు చూపుతుంది. సినిమాల విషయంలో అనసూయ ఎంతో ఆచి తూచిగా అడుగులు వేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కథలు పాత్రల విషయంలో కరాకండిగా ఉంటుంది. కథల విషయంలో తన ఎంపికపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతానని గతంలో ఆమె వెల్లడించింది. కేవలం డబ్బుల కోసం తను సినిమాలు చేయనని తనకు టీవీ ద్వారా చాలా డబ్బులు వస్తున్నాయని చాలా సార్లు ఇంటర్వ్యూల ద్వారా తెలిపింది. తను గుర్తింపు కోసమే సినిమాల్లో నటిస్తున్నానని ఆమె క్లియర్ గా చెప్పింది. నటిగా ఛాలెంజింగ్ పాత్రలను చేసేందుకు నేను ఎప్పుడు ఆసక్తిగా ఉంటాను అంది. అందులో భాగంగానే ఆమె మంచి పాత్రలకే ఓకే చెబుతోంది. తాజాగా మరో సినిమాకు సైలెంట్ గా ఆమె సైన్ చేసేసింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో అనసూయ పాత్రే హైలెట్గా ఉంటుందటా.. అనసూయ ఈ సినిమాలో ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుంది. ఇదొక ఆంథాలజీ మూవీ. 6 కథలు మిళితమై ఉంటుందట. ప్రతి కథలో ఓ లీడ్ ఉంటాడు. ఆ ఆరు కథల్లో అనసూయ కథ ఇందులో హైలెట్గా కనిపిస్తుందటా.. ఇంతకు ముందు పేపర్ బాయ్ విటమిన్-షి సినిమాలతో అందరిని ఆకట్టుకున్న జయ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ఈ సినిమాను తీస్తున్నాడు. జయ శంకర్ కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రతి సినిమాను డిఫిరెంట్గా చూపించాలని అనుకుంటాడు. అందుకే ఆయన సినిమా సినిమాకు చాలా గ్యాప్ ఉంటుంది. అనసూయను డిఫరెంట్గా చూపించడానికి ఆమెను ఎన్నుకున్నాడు. ఆగస్టులో అనసూయ సెట్స్ లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. క్షణం రంగస్థలం సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై తన ముద్ర వేసుకుంది అనసూయ. ఆ సినిమాలతో అనసూయ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది అనసూయ. అందుకే జయ శంకర్ తీస్తున్న ఆంథాలజీ మూవీకి ఓకే చెప్పడంతో సినీ ప్రియుల దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. ఒక వైపు బుల్లి తెర మరో వైపు వెండి తెరపై బిజీగా ఉన్న అనసూయ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను కమిట్ అవ్వడం నిజంగా అభినందనీయం. పారితోషికం కోసం కాకుండా సంతృప్తిని ఇచ్చే పాత్రలను చేయాలనుకోవడం నిజంగా అనసూయను అభినందించాల్సిన విషయం. ఈ విభిన్నమైన సినిమా కూడా అనసూయకు సక్సెస్ ను తెచ్చి పెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఏ ఏడాది లోనే ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.