హైదరాబాద్ : మెగాపవర్ స్టార్‌రామ్ చరణ్, మేకింగ్ కింగ్ శంకర్ కాంబినేషన్‌లో పొలిటికల్ థ్రిల్లర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూనేలో ప్రారంభమైంది. సాంగ్‌తో చిత్రీకరణ ప్రారంభించారు. రెండువారాల పాటు ఈ పాటను షూట్ చేయాలని శంకర్ ప్లాన్ చేశారు. శంకర్ సినిమాల్లో పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే.. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో పాటల్ని షూట్ చేస్తారు ఆయన. ఈ సినిమాకి కూడా శంకర్.. చెర్రీ, కియా రాలపై ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటకోసం ప్రత్యేకించి బడ్జెట్‌ను కేటాయించారట నిర్మాత దిల్ రాజు. సాధారణంగా తన నిర్మాణంలో రూపొందే సినిమాల బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించే దిల్ రాజు.. ఈ సినిమా విషయంలో శంకర్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు.. శంకర్ గత చిత్రాల్లోని పాటల్లాగానే కలకాలం నిలిచిపోనున్నాయట. ఈ విషయంలో శంకర్‌కి, తమన్‌కి భలేగా వేవ్ లెంత్ కుదిరిందట. ఇక ఈ పాటకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తున్నారు.