హైదరాబాద్ : రీతూవర్మ తెలుగింటి అందాల కథానాయిక. టాలీవుడ్‌తోపాటు తమిళంలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో వైవిధ్యభరిత పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ‘టక్ జగదీష్’తో హిట్ అందుకున్న ఆమె.. శుక్రవారం ‘వరుడు కావలెను’ సినిమాతో అలరిం చడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీపై టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తారు. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో రీతూ నటన చూసి ఎంక్వైరీ చేశాను. తను ఈ చిత్రంలో చాలా బాగుంది. అలాగే ఎప్పటిలా చక్కని నటన కనబర్చి ఉంటుందని నమ్ముతున్నా’’ అని అన్నారు. ఆ తర్వాత మాట మాంత్రికుడు త్రివిక్రమ్ మైక్ అందుకుని ‘‘రీతూవర్మ సినిమా టైటిల్స్ అన్నీ పెళ్లి నేపథ్యంలోనే ఉన్నాయి. చాలాకాలం తర్వాత సినిమా మొత్తం చీరతో కనిపించే హీరోయిన్‌ని చూశా. రీతూ చాలా అందంగా ఉంది. గొప్ప కథానాయికగా వెలిగే అవకాశం ఉంది’’ అని చెప్పారు.