టాలీవుడ్ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌కు సమానంగా ఆమెకు ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సునీత..సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా భర్త రామ్ వీరపనేనితో కలిసి ఓ క్యాండిడ్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లోషేర్ చేసుకుంది. ఇందులో రామ్ సునీతకు దేని గురించో వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంతో ముందుకు రానున్న సంగతి తెలిసిందే.