మహంకాళీ మూవీస్ బ్యానర్ పై మహంకాళీ దివాకర్ నిర్మాతగా మ్యాచో హీరో ఆది సాయికుమార్, నూతన తార దర్షణ బానీక్ జంటగా జీబి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న మూవీ బ్లాక్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆదిసామకుమార్ ఇప్పుడు బ్లాక్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. బ్లాక్ అనే క్యాచీ టైటిల్ ఈ సినిమాను ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అటు సాధారణ ప్రేక్షకుల్లో ఇటు ట్రెండ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలో ఓ అసక్తి క్రియేట్ అయింది. దాంతో పాటే ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్స్ తో విడుదలైన బ్లాక్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి హ్యూజ్ రెస్పాన్ లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన బ్లాక్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది, ఆది సాయికుమార్ పలికిన సంభాషణలు, పలికించిన హావభావాలతో పాటు ఈ టీజర్ లో ఉన్న యాక్షన్ షాట్స్ కి అనూహ్య లభిస్తోంది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కట్స్ తో రిలీజైన ఈ మూవీ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఆమని, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా, పృధ్వి రాజ్, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.
నటీనటులు
ఆదిసాయికుమార్, దర్శన్ బానిక్, ఆమని, సూర్య, కౌశల్ మందా, పృధ్వి రాజ్, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్, ఆనంద్ చక్రపాణి, మందునందన్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – మహంకాళీ మూవీస్
నిర్మాత – మహంకాళీ దివాకర్
దర్శకుడు – జీబి కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ – సురేశ్ బొబ్బిలి
ఎడిటిర్ – అమర్ రెడ్డి
ఆర్ట్ – కేవి రమణ
డిఓపి – సతీష్ ముత్యాల
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్