హైదరాబాద్ : నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు రష్మిక మందన్న. గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి కుర్రకారు మదిని దోచింది. సౌత్‌లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ లోను పలు చిత్రాల్లో కనిపించనుంది. నటిగా రష్మిక సౌత్‌లోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆమె ఒక చిత్రానికి రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఆమె నికర ఆస్తుల విలువ 400మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిసింది. ఈ సంపాదనంతా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే ముంబై, గోవా, కూర్గ్ ప్రాంతాల్లో ఇళ్లు కొనుగోలు చేసింది. ముంబైలోను ఇల్లు కొనుగోలు చేసింది. కొన్ని నెలల క్రితం రూ.50లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్-సి క్లాస్ కారును తనకు తాను గిఫ్ట్‌గా ఇచ్చుకుంది. రూ. 40లక్షల విలువైన ఆడి-క్యూ 3 కారును కూడా కొనుగోలు చేసింది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.