హైదరాబాద్ : ఈ తరం ప్రేక్షకుల్ని కూడా తన యాంకరింగ్‌తో మంత్ర ముగ్ధుల్ని చేయడం ఒక్క సుమకే చెల్లింది. యాంకరింగ్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు ఆమె. తెలుగింట పుట్టి కూడా సరైన ఉచ్ఛరణతో తెలుగు పలకలేకపోతున్న ఎందరో యాంకర్స్.. మలయాళ మాతృభాషైన ఆమెని చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అద్భుతమైన తెలుగు ఉచ్ఛారణతో ప్రేక్షకుల్ని అలరించే ఆమె.. నిజానికి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర య్యారు. దాసరి నారాయణరావు ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ మూవీ.. సుమకి కథానాయికగా తొలి సినిమా. అందులో హీరో వక్కంతం వంశీ. ఈ సినిమా ప్లాప్ అవడంతో.. సుమ యాంకర్‌గా సెటిలైతే.. వక్కంతం వంశీ స్టార్‌రైటర్ అండ్ డైరెక్టర్ అయ్యారు. యాంకరింగ్ రంగంలో సూపర్ సక్సెస్ అయిన సుమ.. త్వరలో మళ్లీ వెండితెరపై నటిగా రీ`ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఒక వీడియోలో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు సుమ. సుమ సిని మాల్లోకి వస్తున్నట్టు వార్తలు చుట్టుముడుతున్న నేపథ్యంలో దానికి ఆమె ఆశ్చర్యపోయినట్టు ఎక్స్‌ప్రెషెన్స్ ఇచ్చారు. ఇంతమంది అడుగు తున్నారు కాబట్టి.. చేసేస్తే పోలా అంటూ వీడియోను ముగించారు.