హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ వెబ్ సైట్‌ను లాంఛ్ చేశారు. దీని ద్వారా ఆన్లైన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని ప్రాంతాలకు ట్రస్ట్ సేవల్ని విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ వెబ్ సైట్‌ను ప్రారంభించినట్టు రామ్ చరణ్ తెలిపారు. చిరు చిత్రసీమలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అందరికీ తెలిసేలా ఈ వెబ్ సైట్‌ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. సషష్ట్రఱతీaఅjవవఙఱ.షశీఎ పేరుతో ప్రస్తుతం ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి నటించిన 150 సినిమాల సమాచారం, పాటలు, దర్శక నిర్మాతలతో ఆయనకున్న రిలేషన్ గురించి సమాచారం ఇందులో లభ్యమవుతుంది.