Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

అధికారవర్గ కాషాయీకరణకు కళ్లెం

కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్య దర్శులు, డిప్యూటీ కార్య దర్శులను యూనియన్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (యు.పి.ఎస్‌.సి.) ప్రమేయం లేకుండా నేరుగా ఐ.ఎ.ఎస్‌. స్థాయి అధికారులను నియమించాలన్న సంకల్పాన్ని మోదీ ప్రభుత్వం మూడు రోజుల్లోనే వెనక్కు తీసుకుంది. 45 మంది అధికారులను నేరుగా నియమించుకోవడానికి గత 17వ తేదీన పత్రికల్లో విడుదల చేసిన వ్యాపార ప్రకటనను మోదీ ప్రభుత్వం మూడో రోజున అంటే మంగళవారం, 20వ తేదీన వెనక్కు తీసుకుంది. ఈ నియామకాల్లో ఏదో పొరపాటు జరుగుతుందన్న జ్ఞానోదయం కలగడంవల్ల తప్పు సరిదిద్దుకోవడానికి కేంద్రం సిద్ధ పడలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యంఉన్న లోక్‌ జనశక్తి, జె.డి.యు ఈ ఆలోచనను గట్టిగా వ్యతిరేకించాయి. కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడైన లోక్‌ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌ బహిరంగంగానే ప్రతిఘటించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే కూడా ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. బి.ఎస్‌.పి. అధినేత మాయావతి కూడా ఈ నియామకాలను వ్యతిరేకించారు. రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.ఎల్‌.డి.) నాయకులు తేజస్వీ యాదవ్‌, మనోజ్‌ రaా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ దళిత నాయకుడు, లోక్‌సభ సభ్యుడు చంద్ర శేఖర్‌ ఆజాద్‌ కూడా నిరసన గట్టిగానే వ్యక్తం చేశారు. 17వ తేదీన విడుదల చేసిన ప్రకటన ప్రకారం 24 మంత్రిత్వశాఖల్లో సంయుక్త కార్యదర్శి, ఉప కార్యదర్శి, డైరెక్టర్‌ స్థానాల్లో అధికారులను నేరుగా నియమించాలని మోదీ ప్రభుత్వం భావించింది. ఈ ప్రకటనను వెనక్కు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ ప్రతిపాదన ఉప సంహరణ గురించి యు.పి.ఎస్‌.సి.కి లేఖ రాశారు. 2016లో ఇదే మంత్రి పార్లమెంటులో మాట్లాడుతూ ఈ పథకం ఏకాభిప్రాయం సాధించకుండా అమలు చేయబోమని హామీ ఇచ్చారు. 2016 నుంచి ఇప్పటిదాకా ఏకాభిప్రాయం సాధించడానికి మోదీ ప్రభుత్వం ఏ ప్రయత్నమూ చేయలేదు. ఆ ఊసే ఎత్తలేదు. తమ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం ఇది మొదటిసారికాదు. ఇటీవలే వక్ఫ్‌ బోర్డుల నిర్వహణకోసం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి.)కి పంపించాలని నిర్ణయించవలసి వచ్చింది. ముఖ్యమైన బిల్లులను కనీసం స్థాయీ సంఘాలకైనా పంపడం మానేసిన మోదీ ప్రభుత్వం వక్ఫ్‌ బిల్లును జె.పి.సి. కి పంపడానికి అంగీకరించింది. ప్రసార మాధ్యమాల బిల్లును కూడా తమకు ఇష్టులైన కొంతమందికి మాత్రమే పంపించి, ఆ తరవాత దాన్నీ వెనక్కు తీసుకుంది. నిరంకుశంగా వ్యవహరించడానికి అలవాటుపడిన ప్రభుత్వం ఈ మాత్రమైనా ప్రజాభిప్రాయాన్ని మన్నించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి శుభ సూచకంగా భావించాలేమో! సార్వత్రిక ఎన్నికల తరవాత బీజేపీ బలంతగ్గి గట్టి ప్రతిపక్షం అవతరించిన తరవాత ఇష్టారాజ్యంగా చెలాయించడం సాధ్యంకాక పోవడమే ఈ మూడు నిర్ణయాలను వెనక్కు తీసుకోవడానికి ప్రధాన కారణం. ప్రతిపక్ష వాణి ద్వారా ప్రజాభిప్రాయాన్ని వినిపించుకోక తప్పని అనివార్య పరిస్థితి ఎదురైంది. అదీగాక జమ్మూ-కశ్మీర్‌, హర్యానా శాసన సభల ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వు జారీ చేసింది. కీలకమైన మహారాష్ట్ర శాసనసభకు కూడా త్వరలో ఎన్నికలు నిర్వహించక తప్పదు. అందుకని దూకుడు, ఏక పక్ష నిర్ణయాలు ఇక మీదట కుదరవని మోదీ ప్రభుత్వానికి అర్థం అయింది.
ఇంత వ్యతిరేకత వ్యక్తం కావడానికి నేరుగా అధికారులను నియమించుకోవడంలో భాగంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారిని ఆ స్థానాల్లో నియమిస్తారన్నది మాత్రమే కారణంకాదు. ఈ పద్ధతిలో నియమించడంవల్ల రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేదు. ఉన్నతాధికారుల నియామకంలో రిజర్వేషన్లు లేకుండా చేయడం అంటే రాజ్యాంగ నిర్దేశాన్ని ఉల్లంఘించడమే. నేరుగా ఉన్నతాధికారుల ప్రతిపాదన బీజేపీది మాత్రమే కాదని, కాంగ్రెస్‌ హయాంలోనే ఈ ఆలోచన చేశారని, 2005లో కాంగ్రెస్‌ నాయకుడు వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పరిపాలనా సంస్కరణల కమిటీ కూడా ఈ ప్రతిపాదన చేసిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు సంఫ్‌ు పరివార్‌కు చెందినవారు గతాన్ని తవ్వడం ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్‌ సింగ్‌నూ దోషిగా నిలబెట్టాలని చూశారు. నెహ్రూను ముగ్గులోకి లాగే ప్రయత్నమూ చేశారు. అదంతా నిజమే అనుకున్నా కాంగ్రెస్‌ చేసిన తప్పులను కొనసాగించడానికే జనం మోదీని గద్దెనెక్కించలేదుగా! కాంగ్రెస్‌ తప్పుచేసి ఉంటే ఆ తప్పే చేయబోయి వెనక్కు తగ్గడం ఎందుకో! ప్రధానమంత్రి మోదీని సామాజిక న్యాయానికి కట్టుబడిన సత్పురుషుడిగా నెలబెట్టడానికి తీవ్ర ప్రయత్నం కూడా జరుగుతోంది. తాము మాత్రం నేరుగా ఉన్నతాధికారుల నియామకంలో దాపరికంలేని పద్ధతి అనుసరిస్తున్నామని డంబాలు పలుకుతున్నారు. ఇందులో ఉన్నదే దాపరికం. రిజర్వేషన్లకు అవకాశం లేకుండా చేయడం. కాంగ్రెస్‌ ఈ పద్ధతిలో నియామకాలు జరిపినప్పుడూ రిజర్వెేషన్లు అమలు చేయలేదని మంత్రి జితేంద్రసింగ్‌ వాదిస్తున్నారు. అది నిజమే అనుకున్నా ఆ పొరపాటును ఇప్పుడు ఎందుకు సరిదిద్దలేదు. ఆ మాటే ఎత్తకుండా ఈ ప్రతిపాదనను వెనక్కు ఎందుకు తీసుకున్నట్టో! మోదీ హయాంలో ఒక్కో ప్రభుత్వ రంగ కంపెనీని మూసేస్తూ ఉండడంవల్ల రిజర్వేషన్లు అమలుచేసే అవకాశమే తగ్గిపోతోంది. 2018లో ఇలాంటి నియామకాలకు ప్రతిపాదించినప్పుడే అనేకమంది రిజర్వేషన్లను అంతం చేస్తున్నారని తీవ్రంగా నినదించారు. నేరుగా ఉన్నతాధికారులను నియమించడాన్ని సమర్థించేవారు ఇది ప్రతిభను గుర్తించడానికి దోహదం చేస్తుందని వాదిస్తున్నారు. ప్రతిభ అగ్రవర్ణాలకే పరిమితం అయి ఉండదు అన్న జ్ఞానం వీరికి బొత్తిగా లేదు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ఆగిపోయి ఉండొచ్చు. కానీ దీని వెనక రిజర్వేషన్లను అంతం చేసే కుట్ర ఉంది. రాజ్యాంగాన్ని బేఖాతరు చేసే పెద్ద పన్నాగం ఉంది. 2018లో ఇలాంటి నియామకాలు జరిపినప్పుడు తిరుగులేని మెజారిటీ ఉన్న బీజేపీకి రిజర్వేషన్లు గుర్తుకు రాలేదు. రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి ఉన్న బంధమూ జ్ఞప్తికి రాలేదు. ఇప్పుడు ఉపసంహరించిన తరవాత మోదీని సామాజిక న్యాయం కోసం పాటుపడేవాడిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. జితేంద్ర సింగ్‌ యు.పి.ఎస్‌.సి.కి పంపిన లేఖ తగినంత సుదీర్ఘంగానే ఉంది. మోదీ కీర్తి గానం ఇందులో ఇమిడి ఉంది. లేకపోతే ఒకే వాక్యంలో ఈ నియామకాలను వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పి ఊరుకుని ఉండవచ్చు. కేవలం ఐ.ఎ.ఎస్‌. స్థాయి అధికారుల నియామకం లోనే కాదు వ్యవసాయ శాఖ జారీచేసిన లేఖలో ఈ నియామకాల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు అని స్పష్టంగా పేర్కొంది. ఇది ఈ ప్రభుత్వ దురాలోచనకు దర్పణం పడుతోంది. విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్ల నియామకంలో, బ్యాంకు ఉన్నతాధికారుల నియామకంలోనూ రిజర్వేషన్ల ఊసే లేదు. విరమించిన ఆలోచన ప్రధానోద్దేశం అగ్రవర్ణాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారిని ఉన్నత స్థానాల్లో ప్రతిష్ఠించడం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img