London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

కేజ్రీ పాదుకా పట్టాభిషేక రాజకీయం

మద్యం విధానం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌కు చివాట్లు పెట్టి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. కానీ ఆ వెంటనే ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. చివరకు మూడు రోజుల కింద కేజ్రీవాల్‌కు తీహార్‌ జైలు నుంచి విముక్తి లభించింది. బెయిలు లభించడం కేజ్రీవాల్‌కు పెద్ద ఊరటే. దాదాపు ఆరు నెలలు జైలు జీవితం గడిపిన తరవాత బెయిలు మీద విడుదలైన కేజ్రీవాల్‌ అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. తాను రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తన స్థానంలో మరో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులొకరు ఆ స్థానంలో ఆశీనులవుతారని ప్రకటించారు. ఆయన మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేయవచ్చు. తనను ప్రజలు నిర్దోషిగా భావిస్తే తప్ప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోనని కేజ్రీవాల్‌ ప్రకటించారు. నవంబరులో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతోపాటు దిల్లీ శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించేలా చూడాలన్నది కేజ్రీవాల్‌ ఆంతర్యం. ఇంకా విచిత్రం ఏమిటంటే కేజ్రీవాల్‌ శాసనసభ రద్దుకు సిఫార్సు చేయలేదు. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు తనకు, తన పార్టీకి ఓటువేసి గెలిపిస్తేనే తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటానని, లేకపోతే లేదని కేజ్రీవాల్‌ అంటున్నారు. అంటే తాత్కాలికంగా ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎన్నికలు జరిగి ప్రజాతీర్పు ఆమ్‌ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉంటే తానే ముఖ్యమంత్రిని అవుతానని కేజ్రీవాల్‌ స్పష్టంగానే చెప్తున్నారు. మద్యం కేసులో న్యాయస్థానాల తీర్పు ఎలా ఉన్నా ప్రజాకోర్టులో తాను నిర్దోషినని నిరూపించుకుంటే ఇక తనకు ఏ ప్రమాదమూ ఉండకుండా చూడడానికే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. ఎన్నికల తరవాత తానే ముఖ్యమంత్రి కావాలంటే తాత్కాలికంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినవారు కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి కావడానికి వీలుగా తప్పుకోవలసిందే. జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేస్తారని నికరంగా తేలిపోయిన తరవాత ఆయన రాజీనామాచేసి చంపై సొరేన్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టి వెళ్లారు. ఆయన జైలు నుంచి విడుదలైన తరవాత చంపై సొరేన్‌ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకున్నారు అనడం కన్నా హేమంత్‌ సొరేన్‌ తప్పించారు అనడమే వాస్తవం. ఆ తరవాత చంపై సొరేన్‌ అలిగారు. చివరకు బీజేపీలో చేరిపోయారు. రేపు ఎప్పుడైనా హేమంత్‌ సొరేన్‌ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవి తనకే దక్కుతుందన్న ఆశతోనే చంపై గోడ దూకేశారు. ఇప్పటికే జార్ఖండ్‌లో అనుభవజ్ఞులైన, అధికారం మీద ఆశ పెంచుకున్న నాయకులు బీజేపీలో ఉన్నారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు తాజాగా మధుకోడాను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. అంటే చంపై సొరేన్‌ ఆశలు నీరుగారినట్టే. నితీశ్‌ కుమార్‌ కూడా ఒక సందర్భంలో జితిన్‌ రాం మాంరీaని తన స్థానంలో కూర్చోబెట్టారు. మళ్లీ రాజీనామా చేయమనే సరికి మాంరీa అలిగారు. కొత్త పార్టీ పెట్టుకున్నారు.
ఈ పరిణామాలన్నీ చూస్తే ప్రాంతీయ పార్టీలను, ఒకటో రెండో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చడానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని తేలిపోతుంది. 2015 నుంచి దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీని ఓడిరచడం బీజేపీకి సాధ్యం కాలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులకు లోపాయికారీగా డబ్బు సంచుల ఆశ చూపించాలన్న బీజేపీ ఎత్తుగడా పారలేదు. అందువల్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులందరూ అవినీతిపరులేనని నిరూపించడానికి ఆ పార్టీకి చెందిన మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, చివరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణంలో అరెస్టు చేశారు. దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌, సీబీఐని మోదీ సర్కారు పరిచారికలుగా వాడుకుంది. ఈ రెండు సంస్థల పని తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. నిజానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ కోరలు తీసేసింది. ఈ నేపథ్యంలోంచి చూస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్‌ నిర్ణయం వెనక పెద్ద వ్యూహం ఏదో ఉందని అనుకోవాల్సి వస్తుంది. రాజీనామా చేయడానికి కేజ్రీవాల్‌ పెట్టుకున్న ముహూర్తానికీ ఓ విశిష్టత ఉంది. మంగళవారం అంటే సెప్టెంబర్‌ 17న రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 17వ తేదీన రాజీనామా చేయడం అంటే ప్రధానమంత్రి మోదీ జన్మదినం రోజుననే రాజీనామా చేయాలని సంకల్పించారు. జన్మదినోత్సవం రోజున మోదీకి మానసిక ప్రశాంతత లేకుండా చేయడం మాత్రమే కేజ్రీవాల్‌ ఉద్దేశం కాదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బెయిలుమీద విడుదలైనప్పుడు సెప్టెంబర్‌ 17 తరవాత మోదీ ప్రధానమంత్రిగా ఉండబోరని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఎందుకు అంటే 75 ఏళ్ల తరవాత పదవిలో ఉండకూడదన్న నియమం పెట్టింది మోదీయే కనక ఆ నియమాన్ని పాటించాలని కేజ్రీవాల్‌ పరోక్షంగా గుర్తు చేస్తున్నారన్న మాట. అయినా ఈ తాటాకు చప్పుళ్లకు మోదీ జడవరుగా! ఏమైనా జనాన్ని ఊరించడంలో కేజ్రీవాల్‌ను మించినవారు లేరు. జైలులో పెట్టినప్పుడు రాజీనామా చేయకుండా జైలునుంచే పరిపాలిస్తానని భీష్మించిన కేజ్రీవాల్‌… తీరా బెయిలు మంజూరు అయిన తరవాత రాజీనామా చేస్తాననడం జనం సానుభూతి సంపాదించే ఎత్తుగడే. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించకూడదని రాజ్యాంగంలోగానీ, మరే చట్టంలోగానీ లేదు. అందుకే న్యాయస్థానాలు జైలు నుంచే పరిపాలిస్తానన్న కేజ్రీని అభ్యంతర పెట్టలేదు. కానీ అత్యున్నత న్యాయస్థానమూ భిన్నంగానే వ్యవహరించింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇచ్చినట్టే ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ల కూడదనీ, ఫైళ్లు చూడకూడని, సంతకాలు చేయకూడదని ఆంక్ష విధించింది. ఇందులో న్యాయస్థానం ఉద్దేశం నిర్బంధంలో ఉన్న వ్యక్తి జైలు నుంచి పరిపాలన కొనసాగించవచ్చునా లేదా కచ్చితంగా తేల్చి చెప్పడం కాదు. బెయిలు మంజూరుకు షరతులు విధించడం మాత్రమే. అత్యున్నత న్యాయస్థానానికి అంతర్నిహితంగా ఉన్న పరిమితులను పసిగట్టిన కేజ్రీవాల్‌ బెయిలు మంజూరు అయిన తరవాత రాజీనామా చేయాలనుకోవడం మద్యం కేసులో న్యాయస్థానాల తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఎన్నికలు ఎదుర్కొని మళ్లీ విజయం సాధించగలిగితే ప్రజాకోర్టులో నిర్దోషిగా తేలానని చెప్పుకోవడానికే. నైతికంగా ఉన్నతాసనం ఎక్కినట్టూ ఉంటుంది. ఎన్నికలకు ఆరునెలల ముందు రాజీనామాచేసి త్యాగ నిరతిని నిరూపించుకున్నట్టు ఉంటుంది. ఇలాంటి ఎత్తుగడలలో మోదీ ఒక్కడే కేజ్రీవాల్‌కు పోటీగా నిలవగలరేమో! పాదుకా పట్టాభిషేక రాజకీయాలు అంటే ఇవే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img