Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

కొంత నిజం చెప్తున్న సర్వే చిలకలు

దేశ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక వ్యవస్థలున్నాయి. వీటిలో కొన్ని మీడియాతో ముడి పడినవీ ఉన్నాయి. మరి కొన్ని కేవలం ఆ పని మాత్రమే చేసేవీ ఉన్నాయి. ఈ సర్వేల ప్రకారం ప్రధానమంత్రి మోదీ మీద ఆదరణ తగ్గుతోందని చెప్పేవి క్రమంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ పలుకుబడి పెరుగుతోందని చెప్పేవీ ఉన్నాయి. కొన్ని సంస్థలు ఆరు నెలలకు ఒకసారి ఈ సర్వే ఫలితాలను వెల్లడిస్తుంటాయి. ఎన్నికలు పూర్తి అయి జూన్‌ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుంచి ప్రధానమంత్రి మోదీకి జనాదరణ క్రమంగా తగ్గుతోందని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేలింది. జనాభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఒక సంస్థ కంప్యూటర్‌ ఆధారంగా టెలీఫోన్‌లో 1,36,463 మందిని సంప్రదించిందట. సి-ఓటర్‌ అనే సంస్థ జులై 15 నుంచి ఆగస్టు పది మధ్య 40, 591 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ సంస్థ గత 24 వారాలలో మొత్తం 95,872 మందిని ఇంటర్వ్యూ చేసి సర్వే ఫలితాలను వెల్లడిరచింది. దేశానికి ఉత్తమ ప్రధాని ఎవరు అని అడిగితే ఇంతకు ముందు మోదీ అని సమాధానం ఇచ్చేవారు ఎప్పుడూ 50 శాతం పైనే ఉండే వారు. ఇప్పుడు ఆయన ప్రభ 49 శాతానికి దిగజారిందట. ఆ తరవాతి స్థానం రాహుల్‌ గాంధీదే అని ఈ సర్వేలో తేలింది. కిందటి సారీ సర్వే నిర్వహించినప్పటికన్నా ఉత్తమ ప్రధానిగా మోదీని ఆమోదించే వారు గణనీయంగా 7.3% తగ్గారు. మిగతా ప్రభుత్వాల కన్నా మోదీ ప్రభుత్వ వ్యవస్థలైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌, ఆదాయపు పన్ను శాఖను ఎక్కువగా దుర్వినియోగం చేస్తోందా అని ఇండియా టుడే సర్వేలో అడిగితే 46శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. 38 శాతం మంది అన్ని ప్రభుత్వాలను దుర్వినియోగం చేసినవే అని సమాధానం ఇచ్చారు. అందుకని ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం మోదీ హయాంలో మితిమీరి ఉండొచ్చు, కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా దుర్వినియోగం లేకుండా పోలేదు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని కిందటేడాది 43 శాతం మంది భావిస్తే ఇప్పుడు వారి సంఖ్య 46 శాతానికి పెరిగింది. మోదీ మీద, ఆయన ప్రభుత్వం మీద జనానికి నమ్మకం తగ్గడానికి ఆర్థికాంశాలే ఎక్కువ కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 50 ఏళ్లుగా నిరుద్యోగం తాండవిస్తోంది. మోదీ హయాంలో 72 శాతం మంది ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయని రిజర్వు బ్యాంకే అంగీకరించింది. జనం ఇల్లు గడపడమే కష్టం అయిపోతోంది. ఉపాధి కల్పనపై ప్రభుత్వం చెప్పే కబుర్లను ప్రజలు నమ్మడం లేదు. ప్రతి ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు నమ్మబలికిన నరేంద్ర మోదీ ఒక్క ఏడాదిలోనైనా రెండుకోట్ల మందికి ఉపాధి కల్పించడంలో విఫలం కావడమే కాదు గత పదేళ్ల కాలంలో ఎన్నిసార్లు లెక్క వేసినా కనీసం మొత్తం కలిపి కూడా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పించలేదు. ఇది మోదీ వైఫల్యం అయిన మాట నిజమే కానీ నిరుద్యోగం ప్రజలను ఎంతగా కుంగతీస్తొందో గ్రహించడానికి పెద్ద కొలమానం. గత ఫిబ్రవరిలో సర్వే జరిపినప్పుడు కూడా 52 శాతం మంది మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు గుత్త వ్యాపారవేత్తలకే ఉపకరిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ మాట చెప్తున్న వారు 58 శాతానికి పెరగడం చూస్తే మోదీ పలుకుబడి తగ్గినందుకు ఆశ్చర్యపడవలసిన పనే లేదు.
రాహుల్‌ గాంధీని మోదీ నాయకత్వంలోని బీజేపీ, మోదీ మొదలుకొని అణాకాణీ బీజేపీ నేతల దాకా ఎంతగా అపఖ్యాతి పాలు చేయాలని చూసినా గత ఏడాదిన్నర రెండేళ్ల కాలంలో ఆయన నడవడికలో, అవగాహనాస్థాయిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. లోకసభలో ప్రతిపక్ష నాయకుడైన తరవాత ఆయన ఎప్పుడు నోరువిప్పినా మోదీ, అమిత్‌ షా లాంటి వారికి ఊపిరాడడం లేదు. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నామన్న భ్రమలో హాస్యాస్పదమైన రీతిలో మాట్లాడుతున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి జరిపిన ఒక సర్వేలో 51 శాతం మంది రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా చాలా సమర్థంగా తన పాత్ర నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఇటీవలి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు విసిరిన బాణాలు అధికారపక్ష అగ్ర నాయకులకు ముళ్లలా గుచ్చుకున్నాయి. ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడ్డారు. లేదా పొంతన లేని సమాధానాలిచ్చి నవ్వుల పాలవుతున్నారు. రాహుల్‌ గాంధీ హిందువులకు వ్యతిరేకి అని స్వయంగా మోదీ పార్లమెంటు సాక్షిగా నిరాధారమైన నింద వేయడం కూడా జనానికి మింగుడు పడలేదు అని సర్వేలో తేలిందట. ఇది కళ్లెదుట సత్యం అయినప్పుడు ఎంత లోపభూయిష్టమైన సర్వేలోనైనా నిజం బయట పడకుండా ఉండదు. ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ స్థాయి మెరుగైందని చెప్పిన వారు 21 శాతం మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 32 శాతానికి పెరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా సర్వేలో పాల్గొన్న వారిలో 8శాతం మంది అఖిలేశ్‌ యాదవ్‌ ను సమర్థించారు. గత ఫిబ్రవరిలో ఆయనను మెరుగైన ప్రతిపక్ష నేత అన్న వారు 4 శాతం అయితే ఇప్పుడు 8 శాతం మంది ఆ మాటే చెప్తున్నారు. జనాభిప్రాయం మోదీకి వ్యతిరేకంగా మారడానికి అనేక కారణాలున్నాయని ఈ సర్వేల్లోనే తేలింది. గత ఫిబ్రవరిలో కులగణనను సమర్థించిన వారు 59 శాతం అయితే తాజా సర్వేలో 74 శాతం మంది కులగణన కావాలంటున్నారు. దిల్లీ పొలిమేరల్లో రైతులు 13 నెలలపాటు బైఠాయిస్తే 2021లో మోదీ వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోక తప్పలేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల కోర్కెను సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది సమర్థించడం సైతం ఎంత మాత్రం ఆశ్చర్య పరచదు. కనీస మద్దతు ధర కల్పించడానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే మోదీ ప్రభుత్వం కాళ్లీడుస్తోంది. ఏ సర్వే సమగ్రమైంది అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేవలం కొన్ని వేలమంది అభిప్రాయాలనే సేకరిస్తుంది. ఇంత సువీశాలమైన దేశంలో వేలమంది అభిప్రాయం జనాభిప్రాయాన్ని ప్రతిబింబించ లేదు. సర్వేలు నిర్వహిస్తున్న సంస్థలు సాధారణంగా అధికారంలో ఉన్నవారి స్తోత్ర పాఠాలకే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే గత సార్వత్రిక ఎన్నికలలో మోదీ అఖండ విజయం సాధిస్తారని జోస్యం పలికిన సర్వే చిలకల గొంతులు ఫలితాలు వచ్చే సరికి మూగబోయాయి. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు నూటికి నూరు పాళ్లు నిజమేననుకోనక్కర్లేదు. కానీ ప్రజాభిప్రాయం కొంతైనా ప్రతిఫలించింది అని సంతృప్తి పడవలసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img