Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

కొత్త పార్లమెంటు భవనానికి ప్రగాఢ సానుభూతి

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం పైకప్పు నుంచి బుధవారం నీళ్లు కారడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం. కారుతున్న నీళ్లను ఒడిసి పట్టడానికి ప్లాస్టిక్‌ బకెట్లు పెట్టిన దృశ్యాలు, రాజ్యసభ ఉన్న చోట ఆ భవనంలోకి వర్షపు నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవేశించడం మోదీ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది. 1927లో నిర్మించిన పాత పార్లమెంటు భవనం చెక్కు చెదరకుండా నిక్షేపంలా ఉంటే… ఏడాది కింద పూర్తి అయిన కొత్త పార్లమెంటు భవనం పైకప్పు నుంచి నీరు కారడం చూస్తే రూ.971 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవన నిర్మాణం ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవడానికి గొప్ప ప్రతిభ అక్కర్లేదు. తన హయాంలో కొత్త పార్లమెంటు భవనం నిర్మించి చరిత్రలో నిలిచిపోవాలన్న ప్రధానమంత్రి దుగ్ధే నాసిరకం నిర్మాణానికి కారణం. కొత్త భవనం శిలాఫలకం మీద తన పేరు చూసుకుని మురిసిపోవడమే కాకుండా అది నాలుగు కాలాలపాటు నిలిచి ఉండాలని మోదీ అనుకోవడానికి మించిన కారణం ఏదీ కొత్త భవనం నిర్మాణోద్దేశంలో కనిపించలేదు. మోదీ ఆశల మీద కొత్త పార్లమెంటు భవనం పైకప్పు నీళ్లు చల్లింది. కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్‌ 10న మోదీయే శంకు స్థాపన చేశారు. 2023 మే 28న కొత్త భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించేశారు. కానీ పార్లమెంటులో భాగమైన రాష్ట్రపతి ముర్మును ప్రారంభోత్సవానికి ఆహ్వానించవలసిన అవసరం మోదీకి కనిపించనే లేదు. 2023 సెప్టెంబర్‌ 19న కొత్త భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమై పోయాయి. ఆ రోజున పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును హడావుడిగా ఆమోదించేశారు. బిల్లు ఆమోదానికి చూపిన హడావుడి, అట్టహాసం ఆ రిజర్వేషన్ల అమలు తక్షణం ప్రారంభించడం లేదు. అవి 2029లోనో, కాకపోతే 2034 తప్ప అమలయ్యే అవకాశమే లేదు. ఈ రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే జనాభా లెక్కలు జరగాలి. 2021లో జరగవలసిన జనాభా లెక్కలు కరోనా కారణంగా నిలిచిపోయాయి. వీలుంటే జనాభా లెక్కలు 2031లో జరుగుతాయేమో. ఆ పని పూర్తి అయితే 2034లో కానీ మహిళా రిజర్వేషన్లు అమలు కావు. అందువల్ల 2029 నుంచి అమలవుతాయన్న ఆశ కూడా ఊహల్లోనే మిగిలిపోతుంది. దిల్లీలో రెండు గంటలపాటు కురిసిన వర్షానికే నూతన పార్లమెంటు భవనం నిర్మాణం ఎంత హీనంగా జరిగిందో రుజువైపోయింది. దిల్లీలో రెండుగంటల వర్షం కేవలం పార్లమెంటు నూతన భవనానికే నష్టం కలిగించలేదు. వర్ష బీభత్సానికి తొమ్మిదిమంది మరణించారు. రాజధాని నగరమంతా జలమయమై పోయింది. ‘‘కొత్త పార్లమెంటు భవనం కన్నా పాత భవనమే మెరుగ్గా ఉంది. మళ్లీ అందులోకే మారిపోతే పోలా!’’ అని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ దెప్పి పొడిచారు. కనీసం కొత్త భవనంలో కురవడం ఆగిపోయే దాకానైనా పాత భవనంలోకి మారిపోదాం అని కూడా అఖిలేశ్‌ అన్నారు. నిజానికి ఇది ఆయన సూచన కాదు. మోదీ ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా ఎత్తి చూపడం. ఈ ప్రభుత్వం నిర్మించిన అన్ని భవనాల పరిస్థితీ ఇలాగే ఉందా. అలా వర్షం వస్తే నీరు చేరడానికి అనువుగా నిర్మించారా అని కూడా అఖిలేశ్‌ యాదవ్‌ నిలదీశారు. మోదీ ప్రభుత్వం బాధ్యతాయుతమైందే అయితే ఈ మాటలన్నీ శూలాల్లా గుచ్చుకుంటాయి. కానీ మోదీ, ముఖ్యమైన మంత్రులు పార్లమెంటు భవనం పైకప్పు నుంచి నీరు కారడంపై వివరణ ఇచ్చిన దాఖాలాలే లేవు.
ప్రభుత్వాధినేతలు ఇలా జరిగినందుకు విచారం వ్యక్తం చేయడం, బాధ్యత తీసుకోవడం లాంటి పనులు చేయలేదు కానీ… లోక్‌సభ సచివాలయం మాత్రం ‘‘ఆ కురవడం చిన్నదే. పైన గాజు గుమ్మటాలను అతికించే చోట పూసిన జిగురు లాంటిది చెదిరిపోయి కురిసింది’’ అని వివరణ ఇచ్చింది. దీన్ని వెంటనే సరి చేశామని సంజాయిషీ ఇచ్చుకుంది. భవనంలోకి వెలుతురు ధారాళంగా రావడానికి చేసిన ఏర్పాటు వర్షం కారణంగా చెదిరిపోయిందని లోక్‌సభ సచివాలయం చెప్పింది. నిజానికి ఈ సంజాయిషీలు, సమాధానాలు ఇవ్వవలసింది భవన నిర్మాణానికి బాధ్యత వహించిన ప్రభుత్వ విభాగానికి. మంత్రిత్వశాఖలది. అటువేపు నుంచి మాత్రం ఏ వివరణా లేకపోవడానికి కేవలం అహంకారమే కారణం. ఈ వివరణలేవీ జరిగిన నష్టాన్ని పూడ్చలేవు. నిర్లక్ష్యాన్ని క్షమించడానికి ఉపకరించవు. నీరు కారడం పార్లమెంటు భవనానికే పరిమితం కాలేదు. దిల్లీ నుంచి వారణాసి వెళ్లే వందే భారత్‌ రైలులోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. అయోధ్యలో నిర్మించిన రామమందిరం గోపురం నుంచి ఇలాగే నీరు కురిసిందన్న ఆరోపణలున్నాయి. గత జనవరిలో అంటే సార్వత్రిక ఎన్నికలు జరగడానికి కొద్ది నెలల ముందు మందిర నిర్మాణం పూర్తికాకముందే మోదీ ప్రారంభించేశారు. ఆలయనిర్మాణం పూర్తి కాకుండా విగ్రహాలు ప్రతిష్టించడం, సంప్రోక్షణ జరిపించడం అశుభం అని హిందూ మత పెద్దలే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా మోదీ ప్రభుత్వం మౌన ముద్రాంకితం అయి ఉంది. అంతే కాదు… అయోధ్యలో నిర్మించిన రామాలయానికి వెళ్లడానికి కావలసిన రోడ్లను కూడా హడావుడిగా నిర్మించి ఓ పని అయిపోయిందన్నారు. ఆ రోడ్లు కూడా ఒక్క వానకే కుంగిపోయాయి. రామ మందిరంలో మురికి నీరు వెళ్లడానికి అవసరమైన ఏర్పాటు కూడా సవ్యంగా లేదని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్‌ ఫిర్యాదు చేసినా మోదీ ప్రభుత్వం తొణక లేదు… బెణకలేదు. అక్కడ కూడా ఆలయ నిర్వహణా వ్యవహారాలు చూసే అధికారులే స్పందించి అసలు ప్రధాన గోపురం నుంచి నీరు కారలేదని ప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. విద్యుత్‌ తీగలను అమర్చడానికి ఏర్పాటుచేసిన పైపుల నుంచి మాత్రమే నీరు కారిందట. విద్యుత్‌తీగలు ఉన్న చోట నీరుచేరితే మరింత ప్రమాదానికి దారి తీస్తుందన్న స్పృహ ఆ అధికారులకు ఉన్నట్టు లేదు. వందల సంవత్సరాల కింద నిర్మించిన అనేక భవనాలు భేషుగ్గా ఉన్నాయి. కుతుబ్‌మినార్‌, చార్మినార్‌, ఎర్రకోట మొదలైనవి వందల సంవత్సరాల కింద కట్టినవే. అవి బాగానే ఉన్నప్పుడు దాదాపు మూడేళ్ల కింద నిర్మాణం ప్రారంభించి గత ఏడాది పూర్తి అయిన పార్లమెంటు భవనం ఒక్క వర్షానికే నీరుకారిపోవడం, రామమందిర గర్భగుడీ అదే స్థితిలో ఉండడం అపారమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సమయంలో ఎందుకు నిలవలేక పోతోందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో నిలిచి పోవడానికి తొందరపాటులో మోదీ చరిత్ర నుంచే తొలగి పోవడానికి మాత్రమే ఈ చిట్కాలు ఉపకరిస్తాయి. చరిత్ర సృష్టించలేని వారికి మిగిలే అవకాశమల్లా చరిత్ర హీనులుగా మిగిలిపోవడమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img