London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

యూట్యూబ్‌ చానళ్లనూ కొనేస్తున్న అదానీ

ఇప్పటికే మీడియా – పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల మీద అంబానీ, అదానీ ఉడుంపట్టు కొనసాగుతోంది. నిజానికి ప్రధాన మైంది అనుకుంటున్న మీడియా మోదీ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఊడిగంచేసే పనిలో తలమునకలై ఉంది. అనేకమంది అనుభవ జ్ఞులైన పత్రికలు గుత్త పెట్టుబడిదార్ల గుప్పెట్లో ఉన్న పత్రికలలో ఇమడలేక యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మోదీ విద్వేష ప్రచారాన్ని ఎదుర్కోవడానికి పాటు పడుతున్నారు. ఇలాంటి వేదికలు వాస్తవం తెలుసుకోవాలనుకునే వారికి ప్రధాన ఆధారాలుగా మారాయి. అవి గుప్పెడే కావచ్చు కానీ లక్షలాది సంఖ్యలో వీక్షకుల అభిమానం సంపాదిస్తున్నాయి. వీటిని కూడా వీలైతే స్వాధీనం చేసుకుని లేకపోతే ఒత్తిడిచేసో, ప్రభావితం చేసో తమ అధీనంలోకి తెచ్చుకోవాలని అదానీ ప్రయత్నిస్తున్నారు. ఆ ఒత్తిడికి తాజాగా సంజయ్‌ శర్మ నడిపే 4 పి.ఎం. యూట్యూబ్‌ చానల్‌ లొంగి పోయింది. సంజయ్‌ శర్మ సాధారణంగా ప్రజాస్వామ్య పరిరక్షణకోసం పాటుపడే సమా చారాన్నే అందించేవారు. అయితే ఆయన యూట్యూబ్‌ చానల్‌ లో జ్యోతిషం లాంటి వాటికీ ముఖ్యమైన స్థానమే ఉంది. కానీ 4 పి.ఎం. చానల్‌ లో జోస్యం చెప్పేవారు కూడా సంజయ్‌ శర్మలో విపరీతమైన మార్పు వస్తుందని పసిగట్టలేక పోయారు. ఇటీవల సంజయ్‌ శర్మ అదానీ పాట పాడడం మొదలు పెట్టారు. లక్నో నుంచి సంజయ్‌ శర్మ ఈ యూట్యూబ్‌ చానల్‌ నడుపుతుంటారు. ఆయన చానల్‌కు దాదాపు 60 లక్షల మంది చందాదారులు (సబ్‌ స్క్రైబర్లు) ఉన్నారు. 4 పి.ఎం. చానల్‌ ఈ స్థితికి రావడానికి మోదీ విద్వేషాన్ని ఎండగట్టే అజిత్‌ అంజుం, అశోక్‌ వాంఖడే లాంటి వారు తోడ్పడ్డారు. ఇటీవల అశోక్‌ వాంఖడే ఆ చానల్‌ కార్యక్రమాల్లో ఇక మీదట పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. దీనితో సంజయ్‌ శర్మ యూట్యూబ్‌ చానల్‌ అసలు కథ బయట పడిరది. ఇటీవల సంజయ్‌ శర్మ అదానీని వేనోళ్ల పొగు డుతూ ఒక వీడియో విడుదల చేశారు. దానితో అశోక్‌ వాంఖడే లాంటి వారు ఆ చానల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో సంజయ్‌ శర్మ ఇంతవరకు వ్యవహరించిన తీరు కూడా డొల్లేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఇటీవల సంజయ్‌ శర్మ రూపొం దించిన వీడియోలో అదానీపై ఏదైనా కుట్ర జరుగుతోందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. లేక భారత్‌ స్టాక్‌మార్కెట్‌ను కుప్ప కూల్చే కుట్రలు జరుగుతున్నాయా అన్న అనుమానం వ్యక్తం చేశారు. 2020వ సంవత్సరంలో అదానీ కంపెనీకి చెందిన ఒక్కో వాటా (షేర్‌) ధర 200 రూపాయలు ఉండేది. అప్పుడు అదానీ కంపెనీ లాభం వెయ్యి కోట్ల రూపాయలు ఉండేది. 2022కల్లా ఒక్కో షేర్‌ ధర పదిరెట్లు పెరిగింది. కానీ లాభం రూ. 768 కోట్లకు పడిపోయింది. వాటాల ధరలు పెరిగి లాభాలు తరగడంలో ఏదో మతలబు ఉండే ఉండాలి. హిండెన్‌ బర్గ్‌ అదానీకి వ్యతిరేకంగా కుట్ర చేస్తోంది అన్న అనుమానం కూడా సంజయ్‌ శర్మ వ్యక్తం చేశారు. కానీ భారత షేర్‌ మార్కెట్‌ను అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రభావితంచేసే శక్తి హిండెన్‌ బర్గ్‌కు లేదు. ఉన్నా అది తాత్కాలికమే. ఒకవేళ అదే సాధ్యం అయితే హిండెన్‌ బర్గ్‌, టాటా, ఆదిత్య బిర్లా, అంబానీ కంపెనీలకు వ్యతిరేకంగా ఎందుకు సమాచారం వెల్లడిర చలేదు అన్న ప్రశ్న హేతుబద్ధంగా ఆలోచించే వారి మదిలో మెదలక తప్పదు. కానీ అలా జరగలేదు. హిండెన్‌ బర్గ్‌, టాటా, ఆదిత్య బిర్లా, అంబానీ కంపెనీలకు సంబంధించిన సమాచారం వెల్లడిరచలేదు. లొసుగులు ఉన్న అదానీ లాంటి కంపెనీల మీదే హిండెన్‌ బర్గ్‌ దృష్టి పెడుతుంది. అదానీ కంపెనీల్లో లొసుగులు ఉన్నందువల్లే ఆ కంపెనీ వాటాలు ఒక్కసారిగా రూ. 4,000 నుంచి రూ.1,000కి పడిపోయాయి. అదానీ కంపెనీ షేర్ల ధర అమాంతం పెరిగిపోవడానికి మౌలికమైన పునాది లేకపోవడమే ప్రధాన కారణం. స్విస్‌ బ్యాంకులో అదానీ దాచుకున్న దొంగ సొత్తు గురించి హిండెన్‌ బర్గ్‌ సమాచారం విడుదల చేసినా స్టాక్‌ మార్కెట్‌లో అదానీ షేర్ల ధరలు కుప్పకూలలేదు. అందువల్ల పులిలా విజృంభించిన హిండెన్‌ బర్గ్‌ చిట్టెలుకలా తోక ముడుచుకోవాల్సి వచ్చిందని సంజయ్‌ శర్మ వ్యాఖ్యానించారు. ప్రతి సమాచారానికి మార్కెట్‌ స్పందించక పోవచ్చు అన్న వాస్తవాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోకుండా అదానీని నిష్కళం కుడిగా చిత్రించడానికి తాపత్రయ పడ్డారు. హిండెన్‌ బర్గ్‌ పరిశోధనలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. హిండెన్‌ బర్గ్‌ తక్కువ ధరకు షేర్లు కొని లాభాలు సంపాదించుకునే సంస్థ అన్న మాట నిజమే కానీ ఒక్క అదానీ కంపెనీలలోని లొపాలనే ఎందుకు బయటపెడ్తోంది అన్న ప్రశ్న వేసుకో కుండా సంజయ్‌ శర్మ అదానీని వెనకేసుకు రావడానికి తంటాలు పడుతు న్నారు. అంటే ఆయన అదానీకి అమ్ముడు పోయాడు అనుకోవాల్సిందే.
సంజయ్‌ శర్మ 4 పి.ఎం. చానల్‌ కొన్నాళ్లు మూత పడిరది. మళ్లీ కోలుకుంది. సంజయ్‌ శర్మను ప్రేక్షకులు భయంలేని వ్యక్తి అనుకున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయగల దమ్మున్న మనిషి అనుకున్నారు. కానీ ఆయన ఒక్కసారిగా కుప్పిగంతు వేశారు. అదానీ మీద భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. సంజయ్‌ శర్మ నడిపే యూట్యూబ్‌ చానల్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. సబ్‌ స్క్రైబర్ల లెక్కన చూస్తే రవీశ్‌ కుమార్‌ చానల్‌కు కోటి మందికి సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. తార్కికంగా అది అగ్రశ్రేణిది కావాలిగా. కానీ ఫోర్‌ పి.ఎం. చానల్‌కు వీక్షకులు ఎక్కువగా ఉన్నారంటున్నారు. నిజేమే అనుకున్నా సంజయ్‌ శర్మ ఒకే కార్యక్రమాన్ని పేరు మార్చి మళ్లీ మళ్లీ అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇది వీక్షకుల సంఖ్యను పెంచే చిట్కా. సంజయ్‌ శర్మ ఆడుతున్న ఆటలను ఆయనతో పాటు పని చేస్తున్న పత్రికా రచయితలూ పసిగట్టారు. అఖిల్‌ స్వామీ 4 పి.ఎం.కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ ఆయన ఈ కథంతా గమనించిన తరవాత మానేశారు. అశోక్‌ వాంఖడేదీ అదే పరిస్థితి. వాంఖడే నిరంతరం అదానీ నాటకాల గుట్టు విప్పుతుంటారు. మోదీ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడ్తుంటారు. కానీ ఆ తరవాత 4 పి.ఎం.కు సంబంధించిన ఓ వ్యక్తి మీరు ఫోర్‌ పి.ఎం.లోనే కాకుండా మరే చానల్‌ లోనూ అదానీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనడంతో వాంఖడే ఆ చానల్‌కు దూరమయ్యారు. 4 పి.ఎంలో గుజరాత్‌ నుంచి పనిచేసే మయూర్‌ జానీ కూడా సంజయ్‌ శర్మ అమ్ముడు పోయాడంటున్నారు. అదానీని సమర్థిస్తూ గత 16వ తేదీన సంజయ్‌ శర్మ జారీ చేసిన వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన అదానీకి అమ్ముడు పోయారని రుజువు అవుతోందని మయూర్‌ జానీ అంటున్నారు. 4 పి.ఎం. చానల్‌ ను అదానీ కొనేసి ఉండకపోవచ్చు. నిర్వాహకుడిని మాత్రం కొనేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img