Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

రాష్ట్ర ప్రతిపత్తే కశ్మీర్‌ ఎన్నికల ఎజెండా

అయిదేళ్ల కింద 2019 ఆగస్టు అయిదున 370వ అధికరణాన్ని, 35ఎ అధికరణాన్ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశం మేరకు శాసనసభ ఎన్నికలు నిర్వహించక తప్పని స్థితిలో పడిపోయింది. భారతీయ జనసంఫ్‌ు రోజుల నుంచి 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న చిరకాల వాంఛను మోదీ నెరవేర్చారు. జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్రప్రతిపత్తి లేకుండా చేశారు. కశ్మీర్‌ను, లడాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా దిగజార్చారు. 370వ అధికరణాన్ని రద్దు చేసినప్పుడు జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని మోదీ, అమిత్‌ షా ద్వయం హామీ ఇచ్చారు. అయిదేళ్లు గడిచినా ఆ మాట నిలబెట్టుకోక పోగా ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసి కశ్మీరు ప్రజల ఆత్మ గౌరవాన్ని, కశ్మీరియత్‌ (కశ్మీర్‌ తత్వం)ను దెబ్బ తీశారు. కశ్మీర్‌లో 370వ అధికరణం కారణంగానే తీవ్రవాదం పెచ్చరిల్లి పోతోంది అని మోదీ ప్రభుత్వం వాదించింది. కానీ గత అయిదేళ్ల కాలంలో తీవ్రవాదం సమసి పోయిన దాఖలాలే లేవు. తీవ్రవాదులు అడపా దడపా దాడి చేస్తున్నారు. తేడా ఏమిటంటే మునుపు జమ్మూ ప్రాంతంలో లేని తీవ్రవాదుల బెడద ఇప్పుడు అక్కడికి కూడా పాకింది. ఈ మధ్య తీవ్రవాద దాడులన్నీ జమ్మూ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. 370వ అధికరణాన్ని రద్దు చేసినప్పుడు మోదీ ప్రభుత్వం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఉమర్‌ అబ్దుల్లాతో పాటు పిడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచింది. వారు చాలా కాలం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే అవకాశమే ఇవ్వలేదు. ఈ ముగ్గురు అగ్ర నాయకులనే కాక అనేక మంది కశ్మీర్‌ నాయకులను మోదీ ప్రభుత్వం సుదీర్ఘ కాలం జైలులో ఉంచింది. అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌ కృష్ణ అడ్వాణీ బీజేపీ అగ్ర నాయకులుగా ఉన్నప్పుడు కూడా 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న వాదన ఉండేది కానీ వాళ్లు ఎన్నడూ ఆ అధికరణం వల్లే తీవ్రవాదం పెచ్చరిల్లుతోందని వాదించలేదు. దేశ విభజన తరవాత 1987 నాటికి కానీ కశ్మీర్‌లో తీవ్రవాదం వేళ్లూనుకోలేదు. వాజపేయి, అడ్వాణీ హయాంలో వారి అభ్యంతరమల్లా కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉండడం మీదే. ఈ అధికరణాన్ని రద్దు చేసినప్పుడు మోదీ ఎన్నడూ ఆ మాటే ఎత్తలేదు. కశ్మీర్‌లో అల్లకల్లోల పరిస్థితులకు కారణం కేవలం పాకిస్థాన్‌ అని నమ్మించడానికి మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా కృషి చేసింది. కానీ మోదీ పిలవని పేరంటానికి వెళ్లి అప్పటి పాక్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ను కలుసుకోవడానికి కారణం ఏమిటో ఇంతవరకు చెప్పలేదు. ఆయన పర్యటించినందువల్ల కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి ఒనగూడిరదీ లేదు. దేశ విభజన నాటి సమస్యలే కశ్మీర్‌ లో ఇప్పుడూ ఉన్నాయనుకోవడం మోదీ సర్కారు భ్రమే కాదు అజ్ఞానం కూడా. కశ్మీర్‌ ప్రజల్లో మొదటి నుంచీ మూడు రకాల అభిప్రాయాలు ఉన్న వారు ఉన్నారు. మొదటి రకం వారు భారత్‌తోనే ఉండిపోవాలనుకునే వారు. రెండవ రకం స్వతంత్రంగా ఉండి పోవాలనుకునే వారు. మూడో రకం పాకిస్థాన్‌లో చేరిపోవాలనుకునే వారు. కానీ ఈ మూడో రకం వారు ఎప్పుడూ అత్యల్ప సంఖ్యలోనే ఉన్నారు. భారత రాజ్యాంగానికి లోబడి స్వతంత్రంగా ఉండాలనుకునే వారి సంఖ్య కశ్మీర్‌ లో ఎప్పుడూ ఎక్కువే. యూరప్‌లోని మోరి అనే ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ 2003-2004లో రహస్యంగా జనాభిప్రాయ సేకరణ చేసింది. ఆ తరవాత ఆరేళ్లకు మోరీ, గాలప్‌ సంస్థలు బహిరంగంగానే సర్వే చేశాయి. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం కశ్మీర్‌ లోయలో ఉండే వారిలో చూసినా కేవలం 7.5 శాతం మాత్రమే పాకిస్థాన్‌ లో భాగంగా ఉండాలనుకున్నారు. చాలా మంది భారత్‌తోనే ఉండాలనుకున్నారు. కొంత మంది తాము స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. ఇదంతా తీవ్రవాదం పెచ్చరిల్లిన 14 ఏళ్లు, 19 ఏళ్ల తరవాతి వివరం.
విచిత్రం ఏమిటంటే మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ ప్రజలను కేవలం తీవ్రవాదులుగా, వేర్పాటు వాదులుగా పరిగణిస్తుంది. ఈ జాడ్యం మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత మరీ ఎక్కువైంది. కశ్మీర్‌ సమస్యను ఓ కొలిక్కి తీసుకు రావడానికి అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ గట్టి కృషే చేశారు. ఈ ప్రయత్నం ఒక దారికి వస్తున్న దశలోనే 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోయి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తీవ్రవాదం తార స్థాయిలో ఉన్నప్పుడు కూడా కశ్మీరీ ప్రజలు కోరుకుంటున్నది పాకిస్థాన్‌లో చేరిపోవడం కాదని పాక్‌ గూఢచార సంస్థ ఐ.ఎస్‌.ఐ గ్రహించింది. కశ్మీర్‌ గాయం మానడం ఇష్టం లేనందు వల్ల పరోక్ష యుద్ధతంత్రం కొనసాగించింది. పాకిస్థాన్‌లో కలవడం ఇష్టం లేని అనేక మంది నాయకులను హతమార్చింది. మిర్వైజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ తండ్రి మిర్వైజ్‌ మౌల్వీ ఫరూఖ్‌ను 1990 మేలో ఐ.ఎస్‌.ఐ. హతమార్చింది. అంతకు మూడు వారాల ముందే ఆయన బీబీసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడానికి భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. 1996లో హురియత్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ ఘని భట్‌ శాసన సభ ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నారు. ఆయన సోదరుడిని ఐ.ఎస్‌.ఐ. కడతేర్చింది. హురియత్‌ లో అత్యంత గౌరవనీయుడైన అబ్దుల్‌ ఘనీ లోన్‌ను 2002 మేలో హతమార్చారు. ఆయన నాయకత్వంలోని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ కూడా ఎన్నికలలో పోటీ చేయాలనుకుంది. 1991 డిసెంబర్‌ 5న హెచ్‌.ఎన్‌. వాంఛూను హతమార్చారు. ఆయన మానవ హక్కుల పరిరక్షకుడు. ఈ హత్యపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమైంది. అనేక దేశాల గూఢచార సంస్థలు కూడా ఈ హత్యపై ఆరా తీశాయి. 1993లో ఖాజీ నిస్సార్‌ను ఐ.ఎస్‌.ఐ. హత్య చేసింది. మోదీ అధికారంలో వచ్చే నాటికి మన్మోహన్‌ -ముషర్రఫ్‌ నాలుగు సూత్రాల పథకాన్ని ఆమోదించడానికి మిర్వైజ్‌ ఉమర్‌ నాయకత్వంలోని హురియత్‌ సిద్ధపడి ఉంది. జె.కె.ఎల్‌.ఎఫ్‌ నాయకుడు యాసిన్‌ మాలిక్‌ 1994 నాటికే భారత్‌ నుంచి విడిపోవడం తమ లక్ష్యం కాదని ప్రకటించారు. యాసిన్‌ మాలిక్‌ ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అడ్వాణీ హోం మంత్రిగా ఉండగానే డెమొక్రాటిక్‌ ఫ్రీడం పార్టీ నాయకుడు షబ్బిఎర్‌ సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. ఆయనను గత 27వ తేదీన విడుదల చేశారు. అయితే ఆయన రాజకీయాలలో పాల్గొన కూడదని మోదీ ప్రభుత్వం షరతు పెట్టింది. మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి అయిదేళ్లలో కశ్మీర్‌లో మామూలు పరిస్థితులు ఏర్పడడానికి చేసింది శూన్యం. వెరసి తేలేది ఏమిటంటే ఎన్నికల మొగదలో ఉన్న కశ్మీర్‌ ప్రజలు కోరుతున్నది వేర్పాటు వాదమూ కాదు. భారత్‌ తోనే ఉంటూ స్వతంత్రంగా ఉండాలనీ కాదు. ఇప్పుడు ప్రజల తక్షణ ఆకాంక్ష రాష్ట్ర ప్రతిపత్తి మళ్లీ సంపాదించడం. మోదీ ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉన్న జాడలే లేవు. చరిత్ర తెలియని నాయకులతో ఇదే తంటా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img