Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

‘లంచం విశేషాధికారం కాదు’

డబ్బు సంచులు గుమ్మరించి చట్టసభల సభ్యుల ఓట్లు కొనే పద్ధతికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఎన్నికలు, ధన ప్రభావంతో ప్రజా ప్రతినిధులు అమ్ముడు పోవడం మొదలైన అనేకానేక రుగ్మతలు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న తరుణంలో సోమవారం ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని ఇనుమడిరప చేస్తోంది. డబ్బు సంచులతో ప్రభుత్వాల తల రాత మార్చేసి ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు చెప్పకపోయినా అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో ప్రభుత్వాలను స్వాధీనం చేసుకుంటున్న ప్రధాన మంత్రి మోదీ ఈ తీర్పును స్వాగతించడం దుర్మార్గం. ఆయన నాయకత్వంలోని బీజేపీ అక్రమాలకు పాల్పడి ప్రభుత్వాలను కూల్చేయడం, మెజారిటీ లేకపోయినా ప్రజా ప్రతినిధులను కొనేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడాన్ని కూడా ఈ తీర్పు పరోక్షంగానైనా తప్పు పట్టడాన్ని మోదీ మాయ చేసి కప్పిపుచ్చడం సిగ్గు చేటు. సోమవారం నాటి తీర్పుకు అత్యంత ప్రధానమైన నేపథ్యం ఉంది. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పుడు జార్ఖండ్‌ ముక్తి మోర్చా సభ్యులకు డబ్బు ముట్టజూపి విశ్వాస పరీక్షలో పీవీ గట్టెక్కారన్న వాదనలు బలంగా వినిపించాయి. అప్పుడు సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల బెంచి చట్ట సభల సభ్యులు పార్లమెంటులో లంచాలు తీసుకుని ఓటు వేసినా, ఒక పక్షానికి అనుకూలంగా మాట్లాడినా తప్పుపట్టలేమనీ, చట్ట సభల సభ్యుల విశేెషాధికారాల కింద వారికి ఈ అవకాశం ఉందని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సోమవారం ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నాయకత్వంలోని ఏడుగురు సభ్యుల బెంచి తోసి పుచ్చింది. రాజ్యాంగంలో 105వ అధికరణం ప్రకారం పార్లమెంటులో, 194వ అధికరణం ప్రకారం రాష్ట్రాల చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు నిర్భయంగా మాట్లాడడానికి ఉన్న అవకాశం లంచాలు తీసుకుని ఓటు వేయడానికి, మాట్లాడడానికి వర్తించదని ఈ తీర్పు స్పష్టం చేసింది. చట్ట సభల సభ్యులు నిర్భయంగా, నిష్పక్ష పాతంగా మాట్లాడడానికీ తాము మాట్లాడిన అంశాల ఆధారంగా ఎవరో పరువునష్టం కేసులు వేయకుండా 105, 194 అధికరణాలు విశేషాధికారం కల్పిస్తాయి తప్ప లంచాలు తీసుకోవడానికి కాదని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ పీఠం అనుమానాలు తావులేకుండా స్పష్టం చేసింది. అందులో భాగంగానే 1998లో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు చెల్లదని ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని పదిలం చేయడానికి ఉపకరిస్తుంది. న్యాయవ్యవస్థ మీద విశ్వాసం సడలి పోకుండా తోడ్పడుతుంది. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం జార్ఖండ్‌ సభ్యుల మద్దతుతో గట్టెక్కినప్పటికీ వారికి లంచం ఇచ్చారన్న ఆరోపణలు మిన్నంటాయి. ఆ సందర్భంలోనే 1998లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం సభ్యులు పార్లమెంటులో ఓటు వేయడానికి లంచం తీసుకున్నా అది చట్టసభల సభ్యుల విశేషాధికారాల కిందకు వస్తుందని తీర్పు చెప్పింది. అప్పుడు ముగ్గురు సభ్యులు విశేషాధికారాల సూత్రాన్ని అంగీకరిస్తే ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారు.
మెజారిటీ తీర్పు ప్రకారం చట్టసభల సభ్యులు లంచం తీసుకున్నా శిక్ష లేని దౌర్భాగ్య స్థితి వచ్చి పడిరది. ఇప్పుడు ఆ లోపం సరిదిద్దినట్టైంది. ఆ తీర్పు మీద అప్పుడే చాలా విమర్శలు తలెత్తాయి. ఆ విమర్శలు సోమవారం నాటి తీర్పుతో సబబే అని తేలిపోయింది. లంచాలు తీసుకోవడం విశేషాధికారాల కిందకు రాదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఇలా లంచాలు తీసుకోవడాన్ని చట్టసభల సభ్యుల విశేషాధికారంగా భావిస్తే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మూలాలనే నరికేసినట్టు అవుతుందని వ్యాఖ్యానించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదికి మరో పునాది రాయిని చేర్చింది. రాజ్యసభ ఎన్నికలలో ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుని ఓటు వేయడం అవినీతి నిరోధక చట్టం కింద నేరమే అవుతుందని కూడా కుండబద్ధలు కొట్టి చెప్పింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని చెప్తున్న మోదీ ఇలాంటి నిర్వాకాలు అనేకం చేశారు. ఈ తీర్పు ఆ అక్రమాలకు నిష్కృతి చూపకపోవడం ప్రత్యేకంగా గమనించదగిన విషయం. ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి ఏమిటంటే లంచం తీసుకుని ఓటు వేసిన సభ్యుడికి కూడా విశేషాధికారం మిషతో సంపూర్ణమైన రక్షణ ఉండేది. 1993లో పీవీ ప్రభుత్వం మెజారిటీ ప్రశ్నార్థకం అయినప్పుడు లోక్‌సభలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా సభ్యుడు శిబు సొరేన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ 1998 నాటి తీర్పు ఈ కేసుకు స్థానం లేకుండా చేసింది.
పీవీ నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పు అసంబద్ధమైన పరిస్థితిని కల్పిస్తోందని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచి అరమరికలకు తావు లేకుండా తేల్చేసింది. ఇంతకు ముందు 105, 194 అధికరణాల ప్రకారం చట్టసభల సభ్యులకు సభలో నిర్భయంగా మాట్లాడడానికి కల్పించిన విశేషాధికారాలను లంచం తీసుకోవడానికి సైతం అనుమతి వ్వడంగా పరిగణించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నిర్నిబంధ విశేషాధికారమే అవుతుంది. భావప్రకటనా స్వేచ్ఛకు మరింత విస్తృత అవకాశం కల్పించడానికి ఈ విశేషాధికారం కల్పిస్తే దాన్ని లంచాలు పట్టడానికి వర్తింప చేయడం విచిత్రం. ఇప్పుడు ఈ దోషం తొలగి పోయింది. నోటుకు ఓటు అన్న దురాచారం ఓటర్లు ఇచ్చిన తీర్పును వికృతం చేయడానికి, ధనబలంతో ప్రజా తీర్పును అమాంతం మార్చేయడానికి ఇంతకాలం ఉపకరిస్తూ వచ్చింది. అంటే చట్టసభల సభ్యులు లంచాలు పట్టి అవినీతికి పాల్పడినా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి వీలుండేది కాదు. తాజా తీర్పుతో ఈ ‘‘రక్షణ కవచం’’ ఇక మీద ఉండదు. చట్టసభల సభ్యులు లంచం తీసుకుని ఓటు వేయడం అంటే ఒక నేరం పూర్తి అయినట్టేనని చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచి భావించింది. అందుకే ఈ రక్షణ లేకుండా చేసింది. లంచాలు పట్టడం చట్టసభల సభ్యులకు ఉన్న విశేషాధికారాల కిందకు రాదు అని ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు ఎ.ఎస్‌. బొపన్న, ఎం.ఎం. సుందరేశ్‌, పీఎస్‌. నరసింహ, జేబీ పార్దీవాలా, సంజయ్‌ కుమార్‌, మనోజ్‌ మిశ్రా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు రద్దు చేసిన తీర్పును ముగ్గురు సమర్థిస్తే ఇద్దరు వ్యతిరేకించారు. తాజా నిర్ణయంపై ఏకాభిప్రాయం కుదరడం ఆహ్వానించ దగిన పరిణామం. అవినీతి వినాశకరమైంది అయితే అది చట్టసభల సభ్యులకు కూడా వర్తించాలన్నది న్యాయమూర్తుల అభిప్రాయం. అప్పుడే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టు అవుతుంది. ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థకు అర్ధం ఉంటుంది. 105, 194 అధికరణల ప్రకారం లంచం తీసుకోవడానికి కూడా చట్టసభల సభ్యులకు రక్షణ ఉంటుందని 1998 నాటి తీర్పులో ఎలా భావించారో అర్ధం కాదు. నిజానికి 105(2) అధికరణం లంచం తీసుకోవడానికి ఎలాంటి రక్షణ కల్పించదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img