Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

సమన్యాయం లేని న్యాయ సూత్రాలు

చట్టాలు సంక్లిష్టమైనవి. దీనికి కారణాలు ఉండొచ్చు. చట్టాలు సులభమైన భాషలో ఉండి, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎందుకు ఉండవో అర్థం కాదు. చట్టాల్లో సంక్లిష్టత ఉంటుందని అంగీకరించినా న్యాయం కూడా అందరికీ ఒకేలా ఎందుకు ఉండదో కూడా అంతుపట్టని వ్యవహారంగానే ఉంది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిర్దేశించే న్యాయ సూత్రాలు, ఆదేశాలు కూడా అందరి విషయంలో సమానంగా వర్తించవు. అంతెందుకు సుప్రీంకోర్టు నిర్దేశాలు కింది కోర్టులకు ఒక రకంగా, కొన్ని హైకోర్టులకు ఇంకో రకంగా, సుప్రీంకోర్టులోనే కొందరు న్యాయమూర్తులకు మరో రకంగా ఎందుకు అర్థం అవుతాయో తెలియదు. బెయిలు హక్కు, జైలు అత్యవసరం అయితేనే అన్న న్యాయ సూత్రాన్ని నిర్దేశించింది సుప్రీంకోర్టే. కాని అమలులోకి వచ్చే దగ్గరికి ఈ సూత్రం ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా అమలవుతోంది. దిల్లీ మద్యం కేసులో నిందితురాలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌.) ఎమ్మెల్సీ, టి.ఆర్‌.ఎస్‌. అధినేత కె.చంద్రశేఖర రావు (కె.సి.ఆర్‌.) కూతురు కల్వకుంట్ల కవితకు మంగళవారం బెయిలు మంజూరు చేయడంలో అనేక ధర్మ సూక్ష్మాలు ఇమిడి ఉన్నట్టు కనిపిస్తోంది. బెయిలు హక్కు కనక ఆమెకు అత్యున్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేసిందనుకోవచ్చు. ఇదే మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గత మార్చి నుంచి జైలులో ఉన్నారు. మధ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అనువుగా కొద్ది రోజులు ఆయనకు తాత్కాలిక బెయిలు మంజూరు అయింది. ఆ గడువు పూర్తి కాగానే ఆయన మళ్లీ కటకటాలు లెక్కించవలసి వస్తోంది. దిల్లీ మద్యం కేసులో 17 నెలల సుదీర్ఘ కాలం జైలులో గడిపిన దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో నాయకుడు సంజయ్‌ సింగ్‌కు కూడా బెయిలు వచ్చింది. ఇప్పుడు కవితకు బెయిలు వచ్చింది. వీరందరూ కింది స్థాయి కోర్టుల నుంచి మొదలుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి దిగిన వారే. మనీశ్‌ సిసోడియాకు బెయిలు మంజూరు చేసినప్పుడు మద్యం కుంభకోణంతో, ద్రవ్య అక్రమ చెలామణితో ఆయనకు సంబంధం ఉందని ప్రాసిక్యూషన్‌ రుజువు చేయనందువల్ల బెయిలు ఇస్తున్నామని సుప్రీంకోర్టు ప్రకటించింది. దాదాపు ఇదే సూత్రం ఆధారంగా కవితకు బెయిలు మంజూరు అయింది. అంటే దిల్లీ మద్యం కేసులో దాదాపు 50 మంది ఉంటే ఇందులో ప్రముఖులకు బెయిలు వచ్చింది. కొందరు నిందితులు అప్రూవర్లుగా మారి ప్రభుత్వానికి అనుకూలంగా, తమతోపాటు అరెస్టు అయిన వారికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఈ కేసంతా తెమిలే సరికి ఎంత కాలం పడుతుందో తెలియదు. కానీ అప్రూవర్లను భిన్నమైన దృష్టితోనే చూస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.ఆర్‌.గవై, వి.విశ్వనాథన్‌ మంగళవారం కవితకు బెయిలు మంజూరు చేస్తూ చేసిన వ్యాఖ్యలనుబట్టి చూస్తే ఈ కేసు విచారణా స్వరూపమే మారిపోవచ్చుననిపిస్తోంది. దిల్లీ మద్యం కేసు వ్యవహారం రూ. వంద కోట్లకు పైమాటే అంటున్నారు. ఇందులో ద్రవ్య అక్రమచలాణీ వ్యవహారం, అవినీతి లాంటి అంశాలు ఉన్నాయంటున్నారు. కానీ నిందితుల దగ్గరనుంచి ఒక్క రూపాయి కూడా పట్టుబడలేదు. ఆ డబ్బు ఎలా అక్రమంగా వినియోగించారో ప్రాసిక్యూషన్‌ ఇప్పటి దాకా రుజువు చేయలేక పోయింది. ఈ సందర్భాగానే ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్ట్టరేట్‌ (ఇ.డి.) నడవడికను అనేక సార్లు చీదరించుకుంది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చే వాంగ్మూలాలు సంపూర్ణంగా నమ్మనక్కర్లేదు అని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. కవితకు మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నట్టు రుజువులు చూపించండి అని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. సీబీఐ, ఇ.డి. దర్యాప్తు చేస్తున్న తీరును తప్పు పట్టింది. ప్రాసిక్యూషన్‌ చేసిన వితండవాదాలను కూడా న్యాయమూర్తులు తోసి పుచ్చారు. కవిత తన ఫోన్‌లో కొంత సమాచారాన్ని తొలగించారు అని ప్రభుత్వ పక్షం తరఫున వాదించిన అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ అన్నప్పుడు ఫోన్‌ వ్యక్తిగతమైంది, దానిలో సమాచారం తొలగించడం, చేర్చడం లాంటివి తప్పు కాదు అని న్యాయమూర్తులు మందలించే స్థాయిలో మాట్లాడారు.
ఒక్క మద్యం కేసులోనే కాదు వివిధ కేసుల్లో కింది నుంచి పై దాకా న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేయడం లేదా నిరాకరించడంలో ఏక సూత్రత లేదు. బెయిలు హక్కు అన్న సుప్రీంకోర్టు నిర్దేశం ఒకే రీతిలో అమలవుతున్నట్టు కనిపించడం లేదు. దిల్లీ మద్యం కేసులో బెయిలు మంజూరైన నిందితులందరూ ఎన్నో కోర్టులను ఆశ్రయించవలసి వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తన నిర్దేశాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నప్పుడు బెయిలు మంజూరు అవుతోంది. బెయిలు హక్కు అన్న సుప్రీంకోర్టు నిర్దేశం ఇతర సందర్భాలలో ఎలా అమలు అవుతోందో ఆశ్చర్యపడవలసి వస్తోంది. ఉదాహరణకు బీమా కోరేగావ్‌ కేసులో మొత్తం 16 మంది అరెస్టయితే ఏడుగురికి బెయిలు మంజూరు అయింది. ఎవరికి బెయిలు ఎందుకు ఇచ్చారు అన్న విషయంలో తేడాలు ఉండొచ్చు. ఈ పదహారు మందిలో గౌతం నవలఖా, షోమా సేన్‌, సుధా భరద్వాజ్‌, ఆనంద్‌ తెల్తుంబ్డే, అరున్‌ ఫెరీరా, వరవర రావు, వెర్నాన్‌ గొన్సాల్వేస్‌కు బెయిలు దొరికింది. డా. స్టాన్‌ స్వామి నిర్బంధంలో ఉండగానే మరణించారు. వీరందరినీ 2018లో అరెస్టు చేశారు. రోనా విల్సన్‌, సురేంద్ర గాడ్గిల్‌, మహేశ్‌ రౌత్‌, సుధీర్‌ ధవాలే, హనీ బాబు, రమేశ్‌ గైచోర్‌, సాగర్‌ గోర్ఖే, జ్యోతి జగతాప్‌ – మొత్తం ఎనిమిది మంది ఆరేళ్ల నుంచి జైలులోనే మగ్గుతున్నారు. దిల్లీ మద్యం కేసులో మనీశ్‌ సిసోడియాకు బెయిలు మంజూరు చేసినప్పుడు విచారణ ఊసే లేకుండా సుదీర్ఘ కాలం ఏ వ్వక్తినీ నిర్బంధిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించడం, మరీ మాట్లాడితే రాజ్యాంగంలోని 21 వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు చెప్పిన సూత్రం బీమా కోరేగావ్‌ కేసులో ఎందుకు అమలు కావట్లేదో అంతుపట్టదు. కొలబద్ధ ఒకటే అయినప్పుడు కొలతల్లో తేడాలు ఎందుకొస్తాయి. 2020 నాటి ఈశాన్య దిల్లీ మతకలహాల కేసులో ఇరికించి అరెస్టు చేసిన జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్‌.యు.) పరిశోధక విద్యార్థి ఉమర్‌ ఖాలిద్‌ 2020 సెప్టెంబర్‌ నుంచి జైలులోనే మగ్గుతున్నారు. ఆయన కూడా సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. వాయిదాల మీద వాయిదాలకు హాజరయ్యారు. అంతకు ముందు హైకోర్టు ఆయనకు బెయిలు నిరాకరించింది. సుప్రీంకోర్టూ కరుణించలేదు. చివరకు ఉమర్‌ ఖాలిద్‌ కేసు మళ్లీ కింది స్థాయి కోర్టులో విచారణకు వెళ్లింది. ఇలాంటి కేసులన్నింటిలో వేల పేజీల సమాచారం పోగుపడ్తుంది. వందల మంది సాక్షులను ప్రభుత్వం అనేక సందర్భాలలో విచారణ ఎప్పుడు మొదలవుతుంది అన్న ప్రశ్నకు ప్రాసిక్యూషన్‌ తెల్లమొహం వేస్తుంది. విచారణే ప్రారంభం కానప్పుడు ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. నిందితులు ఏళ్ల తరబడి విచారణ ఊసే లేకపోయినా విచారణలో ఉన్న ఖైదీలుగా కటకటాలు లెక్కిస్తూనే ఉండి పోవాల్సి వస్తోంది. అంటే రాజ్యాంగం లోని 21 వ అధికరణానికి కూడా దిశా నిర్దేశం కొరవడిన వ్యవస్థలో నిర్భంధం తప్పదేమో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img