Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సామాజిక న్యాయ దృష్టిని మార్చే తీర్పు

షెడ్యూల్డు కులాలలో (ఎస్‌.సి.), షెడ్యూల్డ్‌ తరగతులలో(ఎస్‌.టి.) ఉన్న ఉపకులాల ఆధారంగా వర్గీకరణ జరగాలని మూడు దశాబ్దాల నుంచి సాగుతున్న ఉద్యమాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఒక కొలిక్కి తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ సహా ఏడుగురు న్యాయమూర్తులలో ఆరుగురు న్యాయమూర్తులు ఉపవర్గీకరణకు అంగీకరించారు. న్యాయమూర్తి బేలా త్రివేదీ మాత్రమే ఉప వర్గీకరణను అంగీకరించలేదు. ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు బి.ఆర్‌.గవాయ్‌, విక్రం నాథ్‌, పంకజ్‌ మిత్తల్‌, మనోజ్‌మిశ్రా, సతీశ్‌చంద్రశర్మ ఉపవర్గీకరణకు సమ్మతిస్తూ తీర్పు వెలువరించారు. ఎస్‌.సి.లుగా గుర్తించేవర్గంలో తెలుగు రాష్ట్రాలలోనే కాదు… దేశమంతటా అనేక ఉపకులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఎస్‌.సి.లు అన్న మాటను మాలలు, మాదిగలు అని విశాలమైన అర్థంలో వాడు తుంటారు. కానీ మాదిగలలో అనేక ఉప కులాలు ఉన్నాయి. సామాజికంగా మాలలు ఎస్‌.సి.లలో భాగమే అయినప్పటికీ వారి వృత్తుల కారణంగా, క్రైస్తవ మత ప్రభావం వల్ల వారి పరిస్థితి కాస్త మెరుగుపడిరది. ఆ వర్గంలో చైతన్యస్థాయి పెరిగింది. అందుకని విద్య, ప్రభుత్వోద్యోగాలలో వారు మెరుగైన స్థితిలో ఉన్నారు. కానీ స్థూలంగా మాదిగలు అనుకునే కులాల వారిలో రిజర్వేషన్ల ఫలితాలను మాలలే ఎక్కువగా అనుభవిస్తున్నారు కనక ఎస్‌.సి.లలో ఉపవర్గీకరణ జరగాలని చాలాకాలం నుంచి పట్టుబడుతున్నారు. తెలుగునేలలో అయితే మంద కృష్ణ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి సుదీర్ఘ కాలంగా ఉద్యమం నిర్వహించింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇంతవరకు తమకు దక్కాల్సిన ప్రయోజనాలను మాలలే అనుభవించారని బాధపడ్డ కులాల వారికి కొంత ఉపశమనం కలగవచ్చు. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈ తీర్పుకు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్నది ముందు ముందు కానీ తేలదు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారించినప్పుడు ప్రధానంగా రెండు అంశాల మీద దృష్టి కేంద్రీకరించింది. ఎస్‌.సి.లనే ఒక వర్గంగా పరిగణించినందువల్ల అందులో మళ్లీ ఉపవర్గీకరణ చేయొచ్చునా లేదా అన్న అంశాన్ని పరిశీలించారు. అంతిమ తీర్పు ప్రకారం ఉప వర్గీకరణం చేయొచ్చుననే నిర్ణయానికి వచ్చారు. రెండో అంశం రాజ్యాంగంలోని 341వ అధికరణం ఎస్‌.సి.లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది కానీ ఎస్‌.సి.లుగా పరిగణించే వారందరూ ఒకే కులానికి చెందినవారు కారు కదా అని చర్చించారు. ఎస్‌.సి.లలో తెలుగు రాష్ట్రాల దృష్టికి పరిమితం అయి చూసినా ఎస్‌.సి.లలో రెండు కులాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఎస్‌.సి.లలో అనేక ఉపకులాలు ఉన్నాయి. ఉత్తరాదిన అయితే ఎస్‌.సి.లను చర్మకార వృత్తిలో ఉన్నవారు, ఇతర వృత్తులు అనుసరించే వారు అన్న ప్రధాన విభజన కనిపిస్తుంది. ఒక్క చర్మకార వృత్తిలో ఉన్నారా లేదా అన్న అంశమే కాకుండా మాదిగలలో అనేక ఉపకులాలు ఉన్నాయి. వారి దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ల ప్రయోజనం కలగాలన్న వాదనను నిరాకరించలేం. కాస్త పరిస్థితి మెరుగ్గా ఉన్న వర్గాలు రిజర్వేషన్ల ప్రయోజనాలను ఎక్కువగా అనుభవించారు కనక తమకు నష్టం కలిగిందని, ఆ నష్టాన్ని పూడ్చడానికి ఎస్‌.సి.ల కిందకు వచ్చే ఉపకులాలను ఉపవర్గాలుగా తేల్చి చూడాలని ఉద్యమాలు జరిగాయి. అత్యున్నత న్యాయస్థానం గురువారం ఇచ్చిన తీర్పువల్ల ఉపవర్గీకరణ సాధ్యం అవుతుంది కనక ప్రధాన ఫిర్యాదు సమసి పోవచ్చు. కానీ దీనివల్ల తమకు దక్కాల్సిన వాటా దక్కకుండా పోతుందని మాలలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశమూ లేక పోలేదు. అప్పుడే ఇలాంటి స్వరాలు వినిపిస్తున్నాయి.
ఎస్‌.సి.లకు వర్తించే రిజర్వేషన్లను ఉప వర్గీకరణ ఆధారంగా అమలు చేయడంతో భారత రాజకీయాలలో పెద్ద పరిణామాలే రావొచ్చు. ఎందుకంటే ఈ ఉపవర్గీకరణ ఒక్క ఎస్‌.సి.లతో ఆగదు. అది కచ్చితంగా షెడ్యూల్డ్‌ జాతుల (ఎస్‌.టి.)కు, ఇతర వెనుకబడిన (ఒ.బి.సి.) వర్గాల వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారి విషయంలోనూ ఇదే విధానం అనుసరించాలని అడగొచ్చు. ఇతర వెనుకబడిన తరగతుల వారి వర్గీకరణ తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో అర్ధ శతాబ్దం పై నుంచే అమలులో ఉంది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్‌ హయాంలో ఈ వర్గీకరణ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ లాంటి చోట్ల వెనుకబడిన తరగతుల వారి మధ్య ఉపవర్గీకరణ ఇప్పటికీ లేదు. తమిళనాడు, బీహార్‌లో అత్యంత వెనుకబడిన వర్గాల వారిని కూడా రిజర్వేషన్ల అమలుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉపవర్గీకరణ వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రాలే చేయవలసి ఉంటుంది. రిజర్వేషన్లు వర్తించే ఎస్‌.సి., ఎస్‌.టి., ఒ.బి.సి.లలో కొన్ని వర్గాల వారు చాలా వెనుకబడి ఉన్నారు. సామాజికంగానూ తేడాలున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గాలకు రిజర్వేషన్లు అమలు అయినందువల్ల రిజర్వేషన్ల కొలమానం ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడిన వారూ ఉండొచ్చు. అయితే ఫలానా సామాజిక వర్గం వారికి సంపూర్ణంగా మేలు కలిగిందని చెప్పలేం. ఒ.బి.సి.లకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన స్థితి వచ్చినట్టు సుప్రీంకోర్టు ఆర్థిక ప్రమాణాన్ని కూడా చొప్పించింది. దీన్నే క్రీమీలేయర్‌ అంటున్నాం. అంటే ఆర్థిక స్తోమత సంపాదించిన వారికి రిజర్వేషన్లు వర్తింప చేయనవసరం లేదని సుప్రీంకోర్టు సూత్రీకరించింది. ఇప్పుడు ఎస్‌.సి.ల ఉపవర్గీకరణను ఆమోదించిన సమయంలోనూ సుప్రీంకోర్టు కాస్త కలిగిన వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలంటోంది. అంతేగాక ఒక తరానికే ఈ వర్గీకరణ వర్తింప చేయాలనీ సూత్రీకరించింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వారికి ఇంతవరకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించాం కనక ఈ అంశాల్లో వారి పరిస్థితి మెరుగైన తరవాత రిజర్వేషన్లు ఎందుకు అన్న వాదన తర్కబద్ధంగానే కనిపిస్తుంది. కానీ కులగణన, ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంకాలు సిద్ధంగా లేవు కనక ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. రిజర్వేషన్‌ సదుపాయం వల్ల విద్యాపరంగా ఎదగొచ్చు. ప్రభుత్వోద్యోగం సంపాదించొచ్చు. కానీ ప్రభుత్వోద్యోగం రాని వారికి, చిల్లరమల్లర పనులుచేసి బతుకీడ్చే వారి తరవాత తరానికి రిజర్వేషన్లు అక్కర్లేదు అంటే ఆచరణయోగంగా ఉండదేమో!. ప్రభుత్వోద్యోగాలలో తగిన ప్రాధాన్యంలేని కులాలకు అవకాశం కల్పించడానికి ఈ తీర్పు వెసులుబాటు కల్గించవచ్చు. కానీ ప్రభుత్వోద్యాగాలే తగ్గిపోతున్నప్పుడు ఉపవర్గీకరణ కూడా పెద్దగా ఉపకరించకపోవచ్చు. అంటే సిద్ధాంతరీత్యా సుప్రీంకోర్టు తీర్పు చాలా ప్రయోజనకరంగా కనిపించినా ఆచరణలో ప్రయోజనం పరిమితం కావొచ్చు. ఉపవర్గీకరణ ఇంతవరకు లేనందువల్ల ఎస్‌.సి.లలో చైతన్యవంతమైన వర్గం ఇన్నాళ్లూ పొందిన ప్రయోజనాన్ని ఏ మేరకు వదులుకుంటుంది అన్న అంశం కూడా రాజకీయాలు వేడెక్కడానికి ఇంధనంగా తయారు కావచ్చు. ఈ తీర్పు సామాజిక న్యాయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయవచ్చు. 1980ల నుంచి కుల రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగింది. ఆ సమీకరణలను మార్చుకోవలసిన అవసరమూ ఉండొచ్చు. ఈ తీర్పు కులగణన కోసం పాటుపడేవారికి అదనపు ఆయుధం అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img