Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

వయనాడ్‌కు దక్కింది సానుభూతే

తిప్పడు తిరుపతి వెళ్లనూ వెళ్లాడు తిరిగి రానూ వచ్చాడు అన్నది ఓ ముతక సామెత. కాని ఇది ఇటీవల తీవ్ర ప్రకృతి వైపరీత్యానికి గురైన కేరళలోని వయనాడ్‌లో ప్రధానమంత్రి మోదీ పర్యటనకు అతికినట్టుగా సరిపోతుంది. సాధారణంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను తప్ప ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నా మోదీకి చీమ కుట్టిట్లయినా ఉండదు. కానీ ఎందుకో ఆయనకు వర్ష బీభత్సానికి గురైన వయనాడ్‌ ప్రజల బాధలపై సానుభూతి కలిగింది. దాదాపు 15 నెలల నుంచి అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న మణిపూర్‌ సందర్శించడానికి మోదీకి తీరిక చిక్కలేదు. కానీ వయనాడ్‌ ప్రజలపై ఏ కారణంవల్లో దయ కలిగింది. కేరళ శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉన్నా వర్ష బాధితులను పరామర్శించడానికి తీరిక చేసుకున్నారు. ఈ ఔదార్యానికి సంతోషించవలసిందే. చాలా ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని ఆయన హెలికాప్టర్‌ నుంచే పరిశీలించారు. కానీ కొన్ని చోట్ల ప్రత్యక్షంగా నష్టాన్ని రెండున్నర గంటల పాటు గమనించారు. ఇది మహా విపత్తు అని రాని కన్నీటి బొట్లూ కార్చారు. కానీ కేరళను ఆదుకోవడానికి మాత్రం ఇప్పటి దాకా ఆయనకు మనసు ఒప్పినట్టు లేదు. ఆర్థిక సహాయం మాట అలా ఉంచినా కేంద్ర మంత్రులు మాత్రం నోరారా కేరళ ప్రభుత్వాన్ని నిందించే పనిలో మునిగిపోయారు. అది మహా విపత్తు అని మోదీ వ్యాఖ్యానించడం, ఏ సహాయమూ అందించకుండా ఉండిపోవడం మోదీ బూటకాల్లో ఒకటి అయి ఉంటుందని మోదీ మంత్రివర్గ సభ్యులు భావిస్తున్నట్టున్నారు. అందుకే శాపనార్థాలు పెడ్తున్నారు. తమ వ్యాఖ్యల ద్వారా రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది శవాలమీద చల్లే పేలాలు ఏరుకోవడం లాంటిదే. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ మరీ బరితెగించి వయనాడ్‌ బాధితులు అందరూ అక్రమంగా నివాసం ఉంటున్న వారేనని నోటికొచ్చినట్టు మాట్లాడారు. వీరు ఆక్రమణలకు పాల్పడి ఆపదకొని తెచ్చుకున్నారు అని అన్నారు. దీనికి అమిత్‌ షా ఆడిన అబద్ధాలు ప్రేరణ కలిగించినట్టున్నాయి. బీభత్సమైన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించినా కేరళ ప్రభుత్వం చలించలేదని అమిత్‌ షా సహజ ధోరణిలో అసత్య ఆరోపణలు చేశారు. కానీ అమిత్‌ షా మాటలు ఎంత తీవ్రమైన అబద్ధాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రుజువులతో సహా నిరూపించిన తరవాత కానీ అమిత్‌ షా నోరు మూతపడలేదు. ప్రకృతి విలయానికి గురైన వయనాడ్‌ను సందర్శించినందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ అభినందించడమూ వృథా అని తేలిపోయింది. వయనాడ్‌ విపత్తును ప్రధానమంత్రి మోదీ జాతీయ విపత్తుగా ప్రకటిస్తారన్న రాహుల్‌ ఆశ కూడా వమ్ము అయింది. సానుభూతి వచనాలు పలకడం తప్ప ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదిలించలేదు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే ఆ బాధ నివారించడానికి కేంద్రం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవలసి వస్తుంది. మోదీకి అది సుతరామూ ఇష్టంలేదు. కేంద్రం చేసిన సహాయమల్లా సహాయ కార్యకలాపాలు నిర్వహించడానికి సైన్యాన్ని, నౌకా దళాన్ని, వైమానిక దళాన్ని, జాతీయ విపత్తు నివారణా విభాగాన్ని రంగంలోకి దించడం మాత్రమే.
కేరళకు ఎదురైన విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాల్సిందేనని నిపుణులూ ఘోషించారు. ఇంత నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఎదుర్కోవడం సాధ్యం కాదని కూడా చెప్పారు. కనీసం దీన్ని తీవ్ర విపత్తుగానైనా కేంద్రం ప్రకటించవచ్చునని మరి కొందరు అంటున్నారు. అలా చేస్తే పార్లమెంటు ఉభయసభల సభ్యులు తమ స్థానిక అభివృద్ధి నిధుల నుంచి కొంతైనా వయనాడ్‌ పునరావాసానికి కేటాయించే అవకాశం ఉంటుంది. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని తీవ్ర ఉపద్రవంగా ప్రకటించింది. ఇప్పుడు అదీ లేదు. కేరళ ప్రభుత్వం కోరుతున్నదల్లా వయనాడ్‌ ప్రజలకొచ్చిన కష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మాత్రమే. ఇలా ప్రకటించడానికి చట్టం ఒప్పుకోదు అని సురేశ్‌ గోపి లాంటి కేంద్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వయనాడ్‌ ఆపద లాంటివి చట్టాల మాటున దాక్కోవడానికి ఉపకరించకూడదు. కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన సహాయ, పునరావాస పథకం ప్రకటించాలని కోరుతోంది. బాధిత కుటుంబాల కోసం ఓ టౌన్‌షిప్‌ నిర్మించాలని కేరళ కోరుతోంది. వయనాడ్‌ లో వర్ష బీభత్సానికి గురైన ప్రాంతాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల, మత్స్య, పశు సంవర్ధక శాఖమంత్రి జార్జ్‌ కురియన్‌ పంపిన నివేదిక ప్రధానమంత్రికి అందింది. అయినా ఉలుకూ పలుకూ లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ ప్రభుత్వ అభ్యర్థనపై నివేదిక ఇవ్వడానికి తొమ్మిది మందితో ఓ కమిటీని నియమించింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలిస్తారట. కేరళకు ఎదురైన ఆపదను మోదీ ప్రభుత్వం, కుటిల రాజకీయాలకు అలవాటు పడిన ఆయన మంత్రివర్గ సభ్యులు కేవలం సంకుచిత రాజకీయ హ్రస్వ దృష్టితోనే చూస్తున్నారు. ఇది మానవతా దృక్పథం బొత్తిగా లేకపోవడానికి చిహ్నం. ప్రతి అంశాన్నీ బీజేపీకి ఎన్నికలలో ఎలా ఉపయోగ పడ్తుంది అన్న దృష్టితోనే చూడడం అమానుషం. ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు ఈ దేశంలో భాగమని మోదీ కేవలం బీజేపీకి ప్రధానమంత్రి కాదని, దేశమంతటికీ ప్రధాని అన్న ఆలోచనే ఈ సంకుచిత జీవులకు ఎప్పటికైనా అర్థం అవుతుందన్న ఆశే లేదు. ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగి పడినప్పుడు, రోడ్లకు అడ్డంకులు ఏర్పడడమే కాక కొన్ని రోడ్లు మాయమై పోయినప్పుడూ మోదీ, ఆయన వంది మాగధులు ఇలాగే వ్యవహరించారా! బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితే ఏర్పడితే నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతారా? అర్థం పర్థంలేని వితండ వాదానికే దిగుతారా? దేశంలో బీజేపీ ఓటర్లు మాత్రమే ఉండరు. జనం ఉంటారు. వారినందరినీ పట్టించుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు. కేంద్రానికి సంపూర్ణమైన బాధ్యత ఉంటుంది. వయనాడ్‌లో పర్యటించి ప్రజల విపత్కర పరిస్థితిని గమనించిన ప్రధానమంత్రి మోదీ కేరళ ప్రజలను ఆదుకోవడం దగ్గరకొచ్చే సరికి పిడికిలి మూసుకోవడం ఏ లెక్కకైనా సబబైంది కాదు. పైగా అది బాధ్యతా రాహిత్యం. పక్షపాత దృష్టి. అన్నింటినీ ఎన్నికలలో ప్రయోజనం కోణం నుంచే చూసే కొంచెపుతనం. వయనాడ్‌ నియోజక వర్గం నుంచి 2019లో రాహుల్‌ గాంధీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో వయనాడ్‌ తో పాటు రాయబరేలీ నుంచి కూడా పోటీ చేసి రెండు చోట్లా నెగ్గారు. వయనాడ్‌ నియోజకవర్గాన్ని వదులుకున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తప్ప మోదీ ప్రభుత్వం నాలుగు రాళ్లు విదిలించదేమో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img