విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి అసౌకర్యం కలిగిన తమకు తెలియజేయాలని, కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు, మండలంలో బయ్యనగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నీ కూటమి పార్టీల నాయకులు సందర్శించారు. ప్రభుత్వ వైద్యులు సమ్మెలో ఉన్నా నేపథ్యంలో, ఆసుపత్రిని సందర్శించడం జరుగుతుందని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్ తెలిపారు. ఆసుపత్రిలోని ప్రజలకు సరైన వైద్యం అందుతుందా లేదా అని, రోగులను ఆరా తీశారు, ఇటువంటి అసౌకర్యం కలిగిన కూటమి పార్టీల నాయకులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు .తేజ, తొంట. దుర్గాప్రసాద్, నరాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.