విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : గర్భిణీలు, బాలింతలు, పౌష్టిక ఆహారం తీసుకోవడం పట్ల, ఆరోగ్యం మెరుగుగా ఉంటుందని, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఇంచార్జ్ సిడిపిఓ ఇ.తులసి పేర్కొన్నారు. మండలంలో కన్నాపురం గ్రామంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎ .నయోమి రాణి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇంచార్జ్ సిడిపివో తులసి మాట్లాడుతూ పౌష్టిక ఆహారం తీసుకోవడం పట్ల మంచి ఆరోగ్యం చేకూరుతుందని, పుట్టబోయే బిడ్డ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగ ఉంటారని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందచేసే పౌష్టిక ఆహారాన్ని, తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎస్ .కే. బాజీ, కే .గణపతి, బొమ్మ. గంటలయ్య, బి. రాఘవ, ఎస్. గణేష్, ఎన్. కృష్ణ, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.