విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అని పరంపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి పేర్కొన్నారు. ఎస్సీ కాలనీ మూడో వార్డులో ఉన్న ఎంపీపీ పాఠశాల ఆవరణలో సర్పంచ్ విజయ కుమారి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం జరిగింది. ఆమె మాట్లాడుతూ మొక్కలను పెంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను అవి పీల్చుకుని, ఆక్సిజన్ ను మనకు అందిస్తాయని, అందుచేత పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ రవికుమార్, బొబ్బర యేసు,పాఠశాల ఉపాధ్యాయులు ఉస్సే కోటేశ్వరరావు, సుశీల, రాజ్యలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.