విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చింపి అవమానపరిచిన , రఘురామకృష్ణరాజు (ఆర్ ఆర్ ఆర్) పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, శాసనసభ్యుని పదవి నుంచి తొలగించాలంటూ మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో మాల మహానాడు దళిత సంఘ నాయకులు రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగo ద్వారా అనేకమంది, అభివృద్ధి చెందుతున్న తరుణంలో రఘురామ కృష్ణంరాజు అణ గారిని వర్గాల వారిపై చిన్నచూపు చూస్తున్నారని , బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ చింపినందుకు ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పత్రాన్ని పోలీసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రొక్కల .నాగరాజు, బొగ్గవరపు. బాబురావు, కరటూరి. చంటి, తొర్లపాటి. శ్రీనివాస్, కిషోర్ ,శేఖర్ ,అబ్రహం తదితరులు పాల్గొన్నారు.