విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా) : ఉంగుటూరు శివారు కొత్త ఉంగుటూరు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల్లో బుధవారంపోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు ఆకుకూరలు, పండ్లు గర్భవతులు, బాలింతలు, పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని దాని వల్ల అనేక వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందని, పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలు వయసు తగినంత బరువు ఎంతో పెరుగుదల చార్ట్ గురించి అంగన్వాడి కార్యకర్త ఎస్ మల్లేశ్వరి తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, పరిశుభ్రత పాటించాలని అంగనవాడి సూపర్వైజర్ శ్రీలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, అంగనవాడి సూపర్వైజర్ శ్రీలక్ష్మి, అంగనవాడి కార్యకర్త మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. తొలిత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.