విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఏ . నయోమిరాని తెలిపారు. మండలంలో అంకాల గూడెం గ్రామంలో సోమవారం నయోమి రాణి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. నయోమి రాణి మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని, తమ బిడ్డల ఆరోగ్యం మెరుగుగా ఉండాలంటే పౌష్టిక ఆహారం ఎక్కువగా తీసుకోవాలని, అంగన్వాడి కేంద్రాల ద్వారా ఇచ్చే వివిధ రకాల ఆహారాలను తీసుకోవాలని ఆమె తెలిపారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పలు సూచనలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడకట్ల గడ్డియ్య, కూటమి పార్టీల నాయకులు , అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.