సర్పంచ్ నాగమణి
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మండలంలో అచ్యుతాపురం గ్రామపంచాయతీలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా, సర్పంచ్ నాగమణి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలను పెంచడం ద్వారా మంచి ఆక్సిజన్ వస్తుందని, తద్వారా ప్రజా ఆరోగ్యాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, వీఆర్వో అనుపమ తదితరులు పాల్గొన్నారు.