ఎంపీటీసీ సోని ఆనంద్
విశాలాంధ్ర- చాట్రాయి : జ్వరాలు….తీవ్రమైన ఒళ్ళు నెప్పులతో బురద నీరు తాగాలా….? బురద నీరు స్నానం చేయాలా….? ఈరోజు కూడా బురద నీరే వచ్చాయంటూ చనుబండ ఎంపీటీసీ సోనిఆనంద్ ప్రశ్నించారు. బుధవారం మధ్యాహ్నం చాట్రాయి ఎంపిపి లంకా నిర్మల అధ్యక్షతన జరిన మండల పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతుండగా చనుబండ ఎంపీటీసీ సోనీ ఆనంద్ మాట్లాడుతూ. మీరు ఎన్ని చెప్పినా జనాలు జ్వరాలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.కనీసం సరిగా బ్లీచింగ్ కూడా చల్లడం లేదు ఏదో సున్నం కొంచెం పోసి వెళ్ళిపోతున్నారు. ఇక మంచినీళ్లు అయితే చెప్పే పనే లేదు. జూన్ నెల నుంచి వాటర్ ట్యాపుల్లో బురదనీరే వస్తుంది . అసలే తీవ్రమైన జ్వరాలు ఒళ్ళు నొప్పులు బురద నీరు తాగాలా బురద నీటితో స్నానం చేయాలా…? జ్వరాలు ఎలా తగ్గుతాయి అని ప్రశ్నించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి మాట్లాడుతూ. జలజీవన్ పనులు చేసిన ప్రతిచోట త్రాగునీటి సమస్య బురద నీళ్లు తీవ్రంగా ఉన్నాయి అన్నారు. జనార్ధన వరం ఎంపిటిసి కృష్ణ మాట్లాడుతూ. గ్రామంలో తాగునీటి పైపులైన్లు తీవ్రంగా కలుషితమైతున్నాయన్నారు.
తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వరా…?
ఎంపీటీసీ చింతగుంట్ల
కృష్ణారావు పాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వరా ఎండిఓ గారు …..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తాగిన బాటిల్లో నీళ్లు తీసుకుని మేము తాగాలా ….? ఈ కర్మ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మనం మంత్రిగారు నియోజకవర్గంలో ఉన్నామన్నారు. జనార్ధన వరం ఎంపిటిసి కృష్ణ మాట్లాడుతూ. ప్రభుత్వం మారేసరికి అధికారులు తీరు మారిపోయిందని మంచినీళ్ళు కూడా ఇవ్వలేనప్పుడు మమ్మల్ని ఎక్కడకు ఎందుకు పిలుస్తున్నారు….? ఇష్టం లేకపోతే సమావేశాలు పెట్టడం మానేయండి పుస్తకాలు ఇంటికి పంపిస్తే సంతకాలు పెట్టి పంపిస్తాం అన్నారు.
ప్రజాప్రతినిధులు పాఠశాలలను పరిశీలించండి…?
ఎంఈఓ విఎస్ వి బ్రహ్మచారి మాట్లాడుతూ. మండలంలో కొన్ని పాఠశాలల ఆవరణంలో నీరు నిలుస్తుందని దానివలన విద్యార్థులకు ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతున్నాయని కొన్నిచోట్ల పాఠశాల భవనాలు బాగోలేదని వర్షాలు కురుస్తున్న సందర్భంలో అటువంటిచోట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజా ప్రతినిధులు కూడా వెళ్లి పాఠశాలలను పరిశీలించి భవనాలు బాగోపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో దుర్గాప్రసాద్ ఏ ఈ సంజయ్ చిత్తపూరు సర్పంచ్ తిరువీధి రమేష్ సోమవారం సర్పంచ్ ఉప్పల శోభన్ బాబు చనుబం సర్పంచ్ విస్సంపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.