విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా): ఉంగుటూరు మండలం ఎరువులు, పురుగుమందుల సంఘం అధ్యక్షులుగా రావులపర్రు గ్రామానికి చెందిన తాడిశెట్టి శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సోమవారం ఉంగుటూరు గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాలులో ఈ సమావేశం జరిగింది. కార్యవర్గ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా మాలికల నాగర్జున, కార్యదర్శిగా వెంకటేశు, కోశాధికారిగా సుబ్బారావు ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తాడిశెట్టి శివప్రసాద్ మాట్లాడుతూ ఎరువులు పురుగులు మందు సంఘాన్ని బలోపేతం చేస్తానన్నారు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.