విశాలాంధ్ర- ఉంగుటూరు(ఏలూరు జిల్లా ) : ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎం సూర్య భగవాన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సై ఏ మణికుమార్ గణపవరం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేకాట కోడిపందాలు ఆడితే సహించేది లేదని హెచ్చరించారు.