భూ ఆక్రమణదారులను తొలగిస్తాం
విశాలాంధ్ర- చాట్రాయి : ప్రభుత్వం మారిన పాలన తీరు మారలేదా…..? అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి స్పందించిన స్థల పరిశీలన చేసిన తహశీల్దారు డి.ప్రశాంతి ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో విజయవాడ సత్తుపల్లి ప్రధాన రహదారి పక్కన చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం గ్రామంలో నూజివీడు కు చెందిన వ్యక్తి 51/ 9 లో సుమారు 75 సెంట్లు భూమిని ఆక్రమించుకొని మొక్కజొన్న ఇతర పంటలను సాగు చేసుకున్న విషయం పై ఇటీవల విశాలాంధ్ర పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దానిపై స్పందించిన చాట్రాయి తాసిల్దార్ డి ప్రశాంతి గురువారం ఉదయం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. స్థలం ప్రభుత్వ పోరంబోకు భూమిగా తాము గుర్తించామన్నారు. పై అధికారుల ఆదేశానుసారం ఆక్రమణలను తొలగించి ప్రజలకు ప్రభుత్వానికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, టిడిపి బీసీ సెల్ మండల నాయకులు కంపసాటి చెన్నారావు కృష్ణారావుపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ పుల్లారావు టిడిపి నాయకులు గోగుల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.