విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తా మెడికల్ కాలేజీలో పి.జి మెడికల్ విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారం మరియు హత్య ఘటన చాలా తీవ్రమైన సంఘటన అని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఇలాంటి దు:ర్ఘటన లు జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అబ్ధుల్ తస్లీమా డిమాండ్ చేశారు.వైద్య విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి కటినంగా శిక్షించాలని, ఇలాంటి దురాగతాలు జరగకుండా ప్రభుత్వం వైద్యులుకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొయ్యలగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దంత వైద్యులు కె.శ్రీనువాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నూనె నాగమణి,పి.హెచ్.ఎన్ సుభద్రా దేవి,హెచ్.వి ఎమ్.కొవ్వాడమ్మ,ఎమ్.ఎల్.హెచ్.పిలు,ఏం.ఎన్.ఎం లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.