asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

రాచూరు హైస్కూల్లో ఎస్ పి ఎల్ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరిగింది

విద్యార్థి సంఘం ఎన్నిక తో హైస్కూల్లో కోలాహాలంగా
విశాలాంధ్ర -ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఉంగుటూరు మండలం రాచూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం ఎస్ పి ఎల్ ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పేపరు పద్ధతి విధానంలో జరిగింది. సాధారణ ఎన్నికల నిర్వహణ లాగా… ఎలక్షన్ అధికారులుగా, ఏజెంట్లుగా విద్యార్థులు విధులు నిర్వహించారు.
హై స్కూల్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు బి వి ఎస్ ఎల్ అరుణాదేవి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిపించారు. సుమారు 150 మంది విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విద్యార్థి సంఘం ఎన్నికలు కోలాహలంగా జరిగింది. ఎన్నికలు ఎంతో ప్రాధాన్య వచ్చింది. ఉంగుటూరు మండలంలో ప్రతి ఏడాది రాచూరు హైస్కూల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థులను నూతన ఉత్సాహం నింపింది. పాఠశాల విద్యార్థి నాయనిగా పొగిరి నాగ సౌజన్య( 9వ తరగతి ), 54 ఓట్లతో ఎంపిక కాగా, ద్వితీయ స్థానం చిల్లా మిన్ని 31 ఓట్లతో ఏ ఎస్ పి ఎల్ ఎన్నికయ్యారు. విజయం సాధించిన విద్యార్థులతో హెచ్ఎం విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా విజేతలను ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెలిచర్ల శ్రీనివాస్, ఎస్ సాయిరాం, రత్న కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్వరరావు, జహాని, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img