విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జమ్ముల ఉదయభాస్కర్ మృతి చెందడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. మండలంలో కన్నాయిగూడెం గ్రామానికి చెందిన ఉదయ భాస్కర్ ఇటీవలే కాలంలో మృతి చెందడం జరిగింది. ఆయన స్వగ్రామమైన కన్నాయిగూడెంలో ఏర్పాటుచేసిన సంతాప సభలో టిడిపి ,జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. టిడిపి పార్టీలో ఉదయభాస్కర్ చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.