విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మండలంలో బోడిగూడెం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జక్కు శ్రీనివాస్ వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, లు రాష్ట్ర ప్రజల పరిరక్షణ కోసం , వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, మొక్కలను నాటడం ద్వారా, అవి పెరిగి పెద్దవై కార్బన్ డయాక్సైడ్ ను అవి పీల్చుకుని, ఆక్సిజన్ ను మనకు అందజేస్తాయని, అందుచేత ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయని, మొక్కలు పెంచడం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని, శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డియ్య, కూటమి పార్టీల నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.