విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం మృతి చెందడం బాధాకరమైన విషయమని, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు, మండల సహాయక కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు తెలిపారు. భారతదేశ ప్రజలకు , కార్మికులకు, ఉద్యమాలకు , ఏచూరి సీతారాం మృతి చెందడం తీరని లోటు అని అన్నారు. ఏచూరి సీతారాం మృతి పట్ల సిపిఐ పార్టీ తరఫు సంతాపం తెలియజేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆంజనేయరాజు తెలిపారు.