పాకిస్తాన్‌కు అమిత్‌షా వార్నింగ్
పాకిస్తాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణలకు పాల్పడినా, కశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనబెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవన్నారు. భారత్‌పై దాడులను ఏమాత్రం సహించబోమని గతంలో మెరుపుదాడులతో నిరూపించామన్నారు. గోవాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి వెళ్లిన అమిత్ షా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పూంచ్‌లో భారత ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన పాక్ ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని అమిత్ షా తెలిపారు. అమిత్‌షా , ఉగ్రదాడులను అరికట్టడానికి మళ్లీ మెరుపుదాడులు చేయడానికి భారత బలగాలు సిద్దంగా ఉన్నాయని హెచ్చరించారు.ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ అని అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్. ఈ సర్జికల్ స్ట్రైక్. ఇండియా సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం చేయకూడదన్న గట్టి సందేశం దీని ద్వారా వెళ్లింది. ఒకప్పుడు చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టే సమయం అని అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో ఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్ పూర్‌లలో జరిగిన ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఉగ్రశిబిరాలపై దాడులు జరిపి ధ్వంసం చేసింది.