London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 14, 2024
Monday, October 14, 2024

అమరావతి సురక్షితమే

. కృష్ణానది వరదలతో రాజధానికి ఇబ్బంది లేదు
. కొండవీటి, పాలవాగు ప్రవాహానికి 48 కిమీ కాల్వల అభివృద్ధి
. ఆరు రిజర్వాయర్లు, 26 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 3 లిప్టులు
. వైసీపీ దుష్ప్రచారం నమ్మొద్దు: మంత్రి నారాయణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమరావతి రాజధాని పూర్తిగా సురక్షిత ప్రాంతంలో ఉందని, కృష్ణానది వరదలతో ఎలాంటి ఇబ్బందీ లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేశారని, ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడారు. రాజధానికి అమరావతి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచబ్యాంకుకు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రాసిందని నారాయణ గుర్తు చేశారు. కృష్ణానదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు. అమరావతి డిజైన్‌ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్ల ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్‌ డిజైన్‌ చేశామని మంత్రి చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడిరటిని పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాలవాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్‌ను 8 కి. మీ మేర అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తామన్నారు. వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కుంచించుకుపోయాయన్నారు. వందేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. వీటితో పాటు ఆరు రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. సీడ్‌ కేపిటల్‌ లోపల నీరుకొండ వద్ద 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు, సీడ్‌ కేపిటల్‌ వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీలు,పెదపరిమి వద్ద 0.2 టీిఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 6 రిజర్వాయర్లు నిర్మిస్తామని వివరించారు. ఎంత వర్షం వచ్చినా కాలువలు, రిజర్వాయర్లు సరిపోతాయన్నారు. ఒకవేళ ఇవి నిండిపోయినా కృష్ణానదిలోకి పంపింగ్‌ చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు మంత్రి చెప్పారు.12,350 క్యూసెక్కుల సామర్థ్యం తో ఉండవల్లి వద్ద, 4000 క్యూసెక్కులతో బకింగ్‌హాం కెనాల్‌ లోకి, 5650 క్యూసెక్కులతో వైకుంఠపురం వద్ద లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవన్నీ పూర్తయితే ఎంతవర్షం పడినా ఒక్క చుక్క కూడా నీరు నిల్వ ఉండదన్నారు. భవిష్యత్తులో కృష్ణానదికి మరింత భారీ వరద వచ్చినప్పటికీ రాజధాని అమరావతికి ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేసేలా రీ డిజైన్‌ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మించే సుమారు 365 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాలకు డిసెంబర్‌లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు.
రాజధాని భవనాలకు ఇబ్బంది లేదు
రాజధానిలో 2014-2019 మధ్య నిర్మించిన భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా భవనాల సామర్థ్యం ఎలా ఉందనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవనాల పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ చెన్నైలను ప్రభుత్వం కోరింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఐకానిక్‌ భవనాలైన సెక్రటేరియట్‌ టవర్లు, హైకోర్టుతో పాటు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మాణం చేసిన 3600 ఫ్లాట్లకు ఎలాంటి ఇబ్బందీ లేదని, వాటి నిర్మాణం కొనసాగించుకోవచ్చని నివేదికలు అందాయని, వాటిని పూర్తి చేసేందుకు రాబోయే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఐకానిక్‌ భవనాల రాఫ్ట్‌ ఫౌండేషన్‌ కూడా బలంగా ఉందన్నారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన వివిధ రకాల పన్నులకు గడువు ఈ నెల 30తో ముగిస్తున్నప్పటికీ వరదల కారణంగా ఆయా ప్రాంతాల వారికి వెసులుబాటు కల్పించేలా గడువు పొడిగిస్తామని మంత్రి నారాయణ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img