Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అమ్మేదెవ్వడు… కొనేదెవ్వడు

విశాఖలో కదం తొక్కిన కార్మిక వర్గం

ప్రాణాలర్పించైనా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : విశాఖ సాగర తీరంలో కార్మికులు కెరటాల వలేె ఎగిసిపడి కదం తొక్కారు. కార్మిక హక్కులకు భంగం కలిగిస్తే ఖబడ్దార్‌ అంటూ నినదించారు. విశాఖ ఉక్కును అమ్మేదెవ్వడు … కొనేదెవ్వడు, ప్రాణాలు అర్పించైనా పరిశ్రమను కాపాడుకుంటామని ఉద్యమకారులు ప్రతిజ్ఞ చేశారు. ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు ముగింపు రోజైన మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగర వీధుల్లో ఎర్రజెండాలతో కార్మిక ప్రదర్శన ప్రజలను ఆకట్టుకునేలా సాగింది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏఐటీయూసీ శ్రేణులు కదంతొక్కారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, లేబర్‌ కోడ్‌ లను రద్దు చేసి పాత చట్టాలని కొనసాగించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానాలను రద్దు చేయాలని, ఏపీ ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ బోర్డులను పునరుద్దరించాలని నినాదాలు చేశారు. సరస్వతి పార్కు జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి వేలాది మంది కార్మికులు తరలివచ్చారు. ర్యాలీ అగ్రభాగాన ఏఐటీయూసీ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రామేంద్ర కుమార్‌, అమర్‌ జిత్‌ కౌర్‌, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్‌, జి ఓబులేసు, జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణతో పాటు అనేక మంది నేతలు కార్యకర్తలు, కార్మికులు ర్యాలీలో తమ హక్కుల రక్షణకై నినాదాలు చేస్తూ నినదించారు.
సరస్వతి పార్క్‌ నుంచి డాబా గార్డెన్స్‌ మీదుగా, అంబేద్కర్‌ సర్కిల్‌, ఎల్‌ఐసి కార్యాలయం, గుడివాడ జంక్షన్‌ మీదుగా జీవీఎంసీ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకుంది. ర్యాలీలో అరకు దింసా నృత్యం ఆకట్టుకుంది. రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కవాతు అందర్నీ ఉత్సాహపరిచింది. డప్పుల మోత, డీజే లతో కార్మిక, యువత నృత్యాల మధ్య ఈ కార్మిక ప్రదర్శన ఉప్పొంగిన ఉత్సాహంతో ముందుకు సాగింది. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టొద్దన్న నినాదాలు హోరెత్తాయి. విశాఖలో జరుగుతున్న ఫార్మా పరిశ్రమలపై శవయాత్ర అందర్నీ ఆకట్టుకుంది. పరిశ్రమల్లో భద్రత కరువై కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, ప్రభుత్వాలు పరిశ్రమల యజమానులకు తొత్తులుగా మారి కార్మిక హక్కులను, వారి ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారని ఈ ప్రదర్శనలో కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ జోలికొస్తే కార్మిక వర్గం ఊరుకోదని హెచ్చరించారు.
ఈ ర్యాలీలో వివిధ జిల్లాలకు చెందిన ఏఐటీయూసీ శ్రేణులతో పాటు అనుబంధ సంఘాలైన అల్యూమినియం వర్కర్స్‌ యూనియన్‌, ఏపీ స్వచ్చాంధ్ర క్లాప్‌ వెహికల్స్‌ డ్రైవర్స్‌ యూనియన్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌, సివిల్‌ సప్లైస్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌, విశాఖ ఆటో, రిక్షా, మోటారు వర్కర్ల సంఘం, ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, మత్స్య కార్మిక సంఘం, వీధి విక్రయదారుల కర్షక ఫెడరేషన్‌, గిరిజన కార్మిక సంఘం, ఆర్టీసీ లైసెన్స్‌ పోర్టర్స్‌ యూనియన్‌, వాల్తేర్‌ రైల్వే వర్కర్స్‌ యూనియన్‌ తదితర అనేక సంఘాల శ్రేణులు పాల్గొన్నారు. సీపీిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. పైడి రాజు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మధరావు, ప్రధాన కార్యదర్శి జి అచ్యుతరావు, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు, నాయకులు ఎం భద్రం, రాజబాబు, అల్లూరి జిల్లా కార్యదర్శి అమర్‌, విజయనగరం జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌, నాయకులు రంగరాజు, శ్రీకాకుళం జిల్లా నాయకులు షణ్ముఖరావు, గోవింద్‌, కాకినాడ జిల్లా నాయకులు తోకల ప్రసాద్‌, విశాఖ జిల్లా నేతలు కసిరెడ్డి సత్యనారాయణ, బూసీ వెంకట్రావు, కె సత్యాంజనేయ, జేడీ నాయుడు, ఎస్‌ కే రెహమాన్‌, జి వామన మూర్తి తదితరులు ప్రదర్శనకు నాయకత్వంవహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img