London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

ఆంధ్రాలో పార్టీ పెట్టమంటున్నారు

గెలిపించుకుంటామంటున్నారు
పాలన చేతకాదన్నారు..చేసి చూపిస్తున్నాం
తెలంగాణ అంధకారమన్నారు.. ఇప్పుడు ఏపీనే చీకటిమయం
సీఎం కేసీఆర్‌ కీలకవ్యాఖ్యలు

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఫిదా అవుతున్నారని సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరిస్థితులు తారుమారవుతాయని అవహేళన చేసిన వారే ఇప్పుడు మన పాలనను చూసి ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఎవరి అంచనాలకు అందకుండా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో మనం చేపడుతున్న పథకాలు, కార్యక్రమా లను కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర పాలకులు అవహేళనగా మాట్లాడారని, మనకు పాలన చేతకాదన్నారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారమవుతుందని ప్రచారం చేశారని, ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని, కరెంట్‌ లేక ఏపీ అంధకారమైందని కేసీఆర్‌ అన్నారు. తమ పథకాలు చూసి ఏపీలోనూ టీఆర్‌ఎస్‌ను విస్తరించమని అక్కడి ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం చేశారు. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వత కీర్తి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంపై ఆనాడు ఉన్న అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. 2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్‌ బాపూజీ సమక్షంలో జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. ఉద్యమ సమయంలో సమైక్య పాలకులు వేయని నిందలు, పెట్టని తిప్పలు లేవన్నారు. చివరకు రాజ్యసభలో బిల్లు ఆమోదానికి ముందు కూడా ఎన్నో ఆటంకాలు సృష్టించారన్నారు. తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని, పాలన చేతకాదని, భూముల ధరలన్నీ పడిపోతాయని కొంతమంది దుష్ప్రచారం చేశారని, ఏడేళ్ల పాలనలో ఆ అపోహలన్నీ పటాపంచలు చేసి వారి నోళ్లకు శాశ్వత తాళం వేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను, ముఖ్యంగా దళితబంధు ప్రకటించాక ఆంధ్ర ప్రాంతవాసులు తమ పార్టీని కోరుకుంటున్నారని కేసీఆర్‌ చెప్పారు. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయని, నాందేడ్‌, రాయచూర్‌ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయన్నారు.
గులాబీ దళపతిగా మళ్లీ కేసీఆర్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ప్లీనరీ వేదికపై ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు అభి వాదం చేశారు. సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజిక వర్గాల నేతలు కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత 9వ సంస్థాగత ఎన్నిక జరుగుతుండగా చివరిసారిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. 2019లో పార్లమెంట్‌ ఎన్నికలు, 2020, 2021లో కరోనా కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img