London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌

ముంబై : క్రూయిజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌ తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం ఏర్పడిరది. బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ఖాన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన కొన్ని కీలక అంశాలను కోర్టులో ప్రస్తావించారు. కుట్రపూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని, డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు. అలాంటప్పుడు ఆర్యన్‌ బెయిల్‌పై విడుదలైతే ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని ప్రశ్నించారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని రోహత్గీ వాదనలు వినిపించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎన్‌సీబీ తరఫున గురువారం ఏఎస్‌జీ అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ఆర్యన్‌ డ్రగ్స్‌ వాడటం ఇది మొదటిసారి కాదని వాదించారు. డ్రగ్స్‌ విక్రేతలను చాలా సార్లు సంప్రదించాడని, డ్రగ్స్‌ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు. వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌తో పాటు సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌, మూన్‌మూన్‌లకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయి కోర్టు ఉత్తర్వులు శనివారం వెలువడే అవకాశం ఉన్నందున నిందితులు జైలు నుంచి శుక్ర, శనివారాల్లో విడుదలై బయటకు వచ్చే అవకాశం ఉందని ముకుల్‌ రోహత్గీ మీడియాకు తెలిపారు. ఆర్యన్‌ఖాన్‌ కు బెయిల్‌ కోర్టు మంజూరు చేయడంతో బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ కుటుంబానికి పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img