Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఇక పీపీపీ ఆసుపత్రులు

. స్థాపన కోసం ఉచితంగా స్థలం
. ప్రభుత్వ ఆసుపత్రులతో కలిపి నిర్వహణ
. అత్యుత్తమ వైద్యసేవలే లక్ష్యం సీఎం చంద్రబాబు వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : త్వరలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో పేదలకు ఆధునిక వైద్యసేవలందించేలా సకల సౌకర్యాలతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ విధానంలో) ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. ఈ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వమే స్థలం అందిస్తుందన్నారు. ప్రభుత్వ, పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని, దేశంలోనే ఏపీ ఆసుపత్రుల పనితీరు అత్యుత్తమంగా ఉండేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. అస్తవ్యస్త విధానాలతో గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్ఠు పట్టించిందని, తద్వారా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మళ్లీ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు అమలు చేయాల్సిన విధానాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రభుత్వం తరపున యాప్‌ రూపొందించి హెల్త్‌ కార్డు ద్వారా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలి. ఆసుపత్రి రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్‌ మెంట్‌, ఇచ్చే మెడిసిన్‌ వివరాలు కూడా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది.
రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంత మంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలి. కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలి. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయంపైనా లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. ఉద్దానంలాగే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్‌ సర్వీసెస్‌ను ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్‌ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.మిస్సింగ్‌ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవు. ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌ ను మళ్లీ తల్లులకు అందించాలి. ప్రతి స్కూలులో పిల్లలకు కంటి పరీక్షలు చేసిన తర్వాత ఏం యాక్షన్‌ తీసుకున్నారో రిపోర్టు చేయాలి. టెలీ మెడిసిన్‌ కు గతంలో వరల్డ్‌ బ్యాంకు నుండి రూ.2,300 కోట్లు నిధులు తీసుకొచ్చాం. కార్పొరేట్‌ లెవల్లో సేవలు అందించాలని నిర్ణయించాం. మళ్లీ అది అమల్లోకి రావాలి. ఫీడర్‌ అంబులెన్స్‌ కు సాధారణ అంబులెన్స్‌ కు కనెక్టివిటీ పెంచాలి. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు మళ్లీ రిపీట్‌ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఫీడర్‌ అంబులెన్స్‌ లు వెళ్లగలిగినప్పటికీ సాధ్యంకాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా నేనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని సీఎం హెచ్చరించారు. ఆసుపత్రుల్లో రోగులకు అందించే దుప్పట్లు కూడా నాణ్యత, శుభ్రంతో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల్లో క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరణాలను తగ్గించాలని సూచించారు. విశాఖ మెడ్‌ టెక్‌ జోన్‌ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. యేడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్‌ మెడ్‌ టెక్‌ జోన్‌ ద్వారా జరుగుతోంది. తక్కువ ఖర్చుతో అన్ని రకాల మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ ను అందిస్తోంది. అయినా దీన్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేదని గుర్తు చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రులను దేశానికే ఒక మోడల్‌లా తీర్చిదిద్దేందుకు అసరమైన మెరుగైన విధానాల అమలుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులంతా సమిష్టి కృషి చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img