Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఇది జల ప్రళయం

. ఏపీకి అండగా ఉంటాం
. ప్రజల ప్రాణాల రక్షణకు చంద్రబాబు కృషి అమోఘం
. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: గతంలో ఎన్నడూ లేనంతగా జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వరదలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించి… తదుపరి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కొనియాడారు. బాధితులకు సహాయ చర్యలు వేగంగా అందుతున్నాయ న్నారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందిస్తున్నారని చెప్పారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా వరద ప్రాంతాల్లో పర్యటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అందరం కలిసి బాధితులను గట్టెక్కించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తాను వరద ప్రాంతాలను పరిశీలించానని చౌహన్‌ స్పష్టం చేశారు. పరిస్థితులు అదుపులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ వందేళ్ల పురాతనమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత వరద వచ్చినా…15 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టపరుస్తామని అన్నారు. దీని పటిష్టతపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో, నిపుణులతో చర్చిస్తామని చెప్పారు. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్‌ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని తెలిసిందన్నారు. పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బృందాలు వరద నష్టంపై అంచనాలు వేస్తాయని, నివేదిక అందగానే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని చౌహన్‌ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… వాతావరణ మార్పుల వల్ల రెండు రోజుల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం కురవడం వల్లే భారీ నష్టం వాటిల్లిందన్నారు. బుడమేరు వద్ద పెద్ద ఎత్తున పైనుంచి నీరు వచ్చిందని తెలిపారు. కేవలం 7 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యం గల బుడమేరు రికార్డుస్థాయిలో 36 వేల క్యూసెక్కుల నీరు వచ్చిందని వివరించారు.
ప్రకాశం బ్యారేజ్‌ను మరింత పటిష్టం చేస్తామన్నారు. మిలటరీ వచ్చి బుడమేరు గండ్లు పూర్తి చేసే పనిలో సాయం చేస్తారని తెలిపారు. వరద ప్రాంతాలను పరిశీలించి ఆదుకునేందుకు వచ్చిన కేంద్రమంత్రి, బృందానికి సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img