Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ఇది జాతీయ విపత్తే

. ఏపీ, తెలంగాణలో ప్రధాని పర్యటించాలి
. హైడ్రా తరహాలో ఏపీలో కాల్వలు, చెరువులు పరిరక్షించాలి
. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి/తాడేపల్లి/మంగళగిరి: వందేళ్లలో ఏన్నడూ సంభవించని వరద ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలనీ, ప్రధాని మోదీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏపీ, తెలంగాణను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాలువలు, చెరువులు, నీటిపారుదల వ్యవస్థ పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలకు పూనుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పార్టీ నేతలతో కలిసి మంగళవారం ప్రకాశం బ్యారేజీ గేట్లను రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు సకాలంలో స్పందించలేదన్నారు. భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ స్పష్టంగా ప్రకటించినప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ఆల్మట్టి డ్యామ్‌ మొదలుకొని అన్ని ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయని, తుంగభద్ర ప్రాజెక్టు నిండుగా ఉందని, శ్రీశైలం డ్యామ్‌, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యాన్ని తగ్గించి ఉంటే ప్రకాశం బ్యారేజీకి ఇంత ఉధృతి ఉండేది కాదన్నారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై పూర్తిగా సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసి… ధైర్యంగా చెరువుల కబ్జాలను తొలగించడానికి పూనుకున్నారని, అలాంటి ధైర్యమైన నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు చేయాలన్నారు. విజయవాడ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఎక్కడెక్కడ అయితే నాళాలు, చెరువులు, కాలువలు, వాగులపై కబ్జాలు జరిగాయో… వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో హైడ్రా తరహా చర్యలకు పూనుకోవాలని కోరారు. అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే బోట్లు కొట్టుకువచ్చి బ్యారేజ్‌ని ఢీకొట్టాయని, ఇందులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి దీనిపై సీనియర్‌ ఈఎన్‌సీ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఆల్మట్టి డ్యామ్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టులలో నీరు ఎక్కువగా ఉండి, భారీ వర్షాలు వస్తున్నప్పుడు అధికారులు అప్రమత్తంగా ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు. 2009లో శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు విడుదల చేయనందువల్ల డ్యామ్‌ పైకి ఎక్కి పారిందని, దాని పర్యవసనంగా కర్నూలు మునిగిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడూ అదే జరిగిందని అధికారులు సకాలంలో స్పందించలేదని, బోట్లు కొట్టుకొస్తుంటే ఏం చర్యలు చేపట్టారో చెప్పాలన్నారు. తుంగభద్ర డ్యామ్‌లో గేటు ఏర్పాటు చేసిన జలవనరులశాఖ సలహాదారు కన్నయ్య నాయుడు లాంటి వారిని గౌరవించాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రళయం లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిందనీ, మూడు రోజులుగా వరద బాధితులు నీరు, ఆహారం, మందుల కోసం నిలువెత్తు నీటిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ, తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, తక్షణమే కేంద్రం నుంచి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.
ప్రకాశం బ్యారేజీకి సమాంతర బ్యారేజీ నిర్మించాలి: ముప్పాళ్ల
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీపై భారీ వాహనాల రాకపోకలను సుమారు 15 సంవత్సరాల క్రితం నిషేధించారని, గుంటూరు ప్రాంతం నుంచి విజయవాడకు వెళ్లవలసిన వారు ఎంతో ప్రయాసకు గురయ్యారని చెప్పారు. దీనిపై అఖిలపక్షంగా ఏర్పడి పెద్ద ఉద్యమం నడిపామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా కనీసం 14లక్షల నుంచి 15 లక్షల క్యూసెక్టుల సామర్ధ్యంగల మరో బ్యారేజీ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, అమరావతి నుంచి ఉండవల్లి వరకు రెండు లైన్ల రహదారి ఏర్పాటు చేసి… రెండు వైపుల పార్కులు, పచ్చదనం పెంచి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ముప్పాళ్ల సూచించారు. అలాగే, ఉండవల్లి నుంచి రేపల్లె వరకు కరకట్టను డబుల్‌ రోడ్డుగా మార్చాలని, తుపానులు, వరదలు వచ్చినా ఆ రోడ్డు దెబ్బతినకుండా…ఇళ్లు, పంటపొలాలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రతిపాదనలపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అమరావతి సమీపంలోని వైకుంఠపురం వద్ద కరకట్ట బ్రేక్‌ అయి మద్దూరు వైపు నుంచి పొలాలమీదుగా వచ్చిన వరద వల్ల అమరావతికి ప్రమాదమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గజవల్లి వెంకట కృష్ణారావు, తాడేపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు కాలనీని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులతో కూడిన బృందం మంగళవారం పరిశీలించింది. నీట మునిగిన వీధులతో పాటు చేనేత మగ్గాలను వారు పరిశీలించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలనే వర్షాలు వచ్చినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని బాధితులు సీపీఐ నాయకులకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ, ముప్పాళ్ల మాట్లాడుతూ, మంగళగిరి రత్నాల చెరువు కాలనీ ప్రాంతంలో ఉన్న సుమారు 1500 మగ్గాలు గుంటల్లోకి నీళ్లు చేరి గత వారం రోజుల నుంచి పనులు లేకుండా పోయిన పరిస్థితి ఉందని అన్నారు. అయితే ఎప్పటికప్పుడు మోటర్లు పెట్టి నీటిని తోడిరచటం వలన కొంత ఉపశమనం జరిగినప్పటికీ చేనేత కార్మికుల వృత్తి సంక్షోభంలోకి నెట్టువేయబడిర దన్నారు. పని కోల్పోయారని చెప్పారు. జీఓ 5 ప్రకారం చేనేత కార్మికులకు ఎంత నష్టం జరిగిందో దాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మండల కార్యదర్శి జాన్‌ బాబు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నందం బ్రహ్మేశ్వరరావు, గంజి పట్టాభి, గంజి వెంకయ్య, బత్తుల గిరి, దొడ్డి ఈశ్వరరావు, బత్తూరి మోహనరావు, గజవల్లి వెంకటకృష్ణ, కాకర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img