Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

ఉంటారా… ఫిరాయిస్తారా

. దిక్కులు చూస్తున్న వైసీపీ ఎంపీలు
. రాజ్యసభలో 11 మంది బలం
. టీడీపీ నేతలతో సంప్రదింపులు?
. అధిష్ఠానం అప్రమత్తం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యులు దిక్కులు చూస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. అందరూ నమ్మిన వారికే అధిష్ఠానం పదవులు కేటాయించగా, ఉంటారా… ఫిరాయిస్తారా అనేదీ వైసీపీలో కలవరంగా మారింది. టీడీపీలోకి కొందరు ఫిరాయిస్తారనే ఊహాగానాలు సామాజిక మాద్యమాల వేదికగా విస్తృతంగా నడుస్తున్నాయి. వైసీపీ అధికార మీడియా కూడా అప్రమత్తమై… తమ పార్టీ ఎంపీలకు టీడీపీ ఎర వేస్తోందంటూ ఒక కథనం రాసింది. అంతటితో ఆగకుండా వైసీపీ రాజ్యసభ ఎంపీలకు ఒక్కొక్కరికీ రూ.70 కోట్లు ఇచ్చేలా సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలిపింది. దీనికితోడు సామాజిక మాద్యమాల్లోను వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కొందరు చేజారిపోయే అవకాశం ఉన్నట్లు కోడై కూస్తోంది. ఎందరు వెళ్తారో, ఎవరు ఉంటారో తెలియక ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరా తీస్త్నుట్లు తెలిసింది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 ఎంపీలున్నారు. వారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమిల నట్వానీ ఉన్నారు. ఇందులో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి పదవీ కాలం ఒకటి ఏప్రిల్‌, 2030 వరకు ఉంది. వి.విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు రాజ్యసభలో 21 జూన్‌, 2028 వరకు కొనసాగుతారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమి నట్వాని పదవిలో 21 జూన్‌, 2026 వరకు ఉంటారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌తోనే కలిసి నడుస్తున్నారు. అలాంటి వారిద్దరూ పార్టీ వీడతారనే ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. బీసీ వర్గాలకు చెందిన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ జగన్‌కు నమ్మినబంటుగా మెలుగుతున్నారు. గొల్ల బాబూరావు సుదీర్ఘకాలంపాటు వైసీపీలో కొనసాగుతున్నారు.
ప్రస్తుతమున్న వారంతా జగన్‌కుగాని, వైఎస్‌ఆర్‌ కుటుంబానికిగాని ఏదోఒక సంబంధంతో ఉన్నవారే. అలాంటి వారంతా ఒక్కసారిగా పార్టీ ఫిరాయిస్తారన్న ఊహాగానాలు రావడంతో వైసీపీ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎంపీల బలమూ చేజారింది. 25 ఎంపీల్లో కేవలం నాలుగు ఎంపీలనే వైసీపీ గెలుచుకోగా, మిగిలిన ఎంపీలను కూటమి నేతలు దక్కించుకున్నారు. అటు రాజ్యసభలో మాత్రం వైసీపీకి 11 ఎంపీలతో పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. టీడీపీ జీరో స్థానంతో ఉంది. రాబోయే రెండేళ్ల వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. టీడీపీ రాజకీయ చరిత్రలో రాజ్యసభలో జీరో స్థానంతో ఉన్న పరిస్థితులు గతంలో ఉన్నడూ లేవు. వైసీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించే పరిస్థితులు లేవు. వారెక్కడున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రవేశపెట్టిన వివిధ బిల్లులకూ లోక్‌సభ, రాజ్యసభలో వైసీపీ ఎంపీలు పూర్తి స్థాయి మద్దతిచ్చి అభాసుపాలయ్యారు. దీంతో వైసీపీ రాజ్యసభ ఎంపీలతో కొందరు టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం. అదే జరిగితే ముగ్గురు నుంచి ఆరుగురు చేజారిపోతారని సమాచారం.
దీనిని పార్టీ అధిష్ఠానం తేలిగ్గా తీసుకోకుండా, వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. ప్రస్తుతమున్న రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురికి వ్యాపార పరంగా ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వంతో అవసరాలు ముడిపడి ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని వారేమైనా పార్టీ వీడతారా? అనేదీ గందరగోళంగా మారింది. టీడీపీలోకి ఎవరైనా వెళ్తే, తక్షణమే వారితో రాజీనామా చేయించి, ఆ తర్వాత వచ్చే ఖాళీ స్థానాన్ని వారితోనే భర్తీ చేయించేలా ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img