రష్యా యుద్ధ ప్రకటనతో ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలు, గగనతలాన్ని ఉక్రెయిన్ మూసివేసింది.దాంతో ఆ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కీవ్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి వచ్చేసింది. గురువారం ఉదయం 7.30 గంటలకు న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ‘ఏఐ 1947’ ఎయిర్ ఇండియా విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయల్దేరింది. అయితే రష్యా యుద్ధం నేపథ్యంలో గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో ఎయిర్ మిషన్ సూచన మేరకు అధికారులు విమానాన్ని మళ్లీ భారత్‌కు మళ్లించారు. కాగా, కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు ఢీల్లీకి చేరింది. అందులో 182 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.